జాతీయ వార్తలు

ఆశలు తీర్చే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎలాంటి చార్జీల మోతా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వ రైల్వే బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మరింత వేగాన్ని, భద్రతను సంతరించుకునే దిశగా రైల్వేలను తీర్చిదిద్దాలన్న దూరదృష్టికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్ అద్దం పడుతోందని అన్నారు. ప్రయాణికులే ప్రధానంగా రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ జాతి పునరుత్థానానికి దోహదం చేస్తుందని మోదీ తెలిపారు. అటు వౌలిక సదుపాయాలకు, ఇటు ఉపాధి కల్పనకు పెద్దపీట వేసిన రైల్వే బడ్జెట్ ఎంతో ప్రత్యేకత కలిగిందని స్పష్టం చేశారు. అభివృద్ధి చోదకంగా రూపొందించిన ఈ బడ్జెట్ వల్ల రైల్వేలు సమగ్రరీతిలో పరివర్తన చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. విజన్ 2020 ద్వారా రైల్వే సామర్ధ్యం మరింత పెరుగుతుందన్నారు. వేగం, భద్రతతోపాటు సమయపాలన కూడా మెరుగవుతుందని తెలిపారు. గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఎన్నో విజయాలు సాధించామని కొత్త బడ్జెట్‌లో వాటిని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. సమాచార టెక్నాలజీతోపాటు ఈ బడ్జెట్‌లో పెట్టుబడులకు కూడా పెద్దపీట వేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లకంటే కూడా రైల్వేల్లో పెట్టుబడులు రెండున్నర రెట్లు పెరిగాయన్నారు. అన్ రిజర్వ్‌డ్, సూపర్‌ఫాస్ట్, అంత్యోదయ, దీన్‌దయాళ్ రైళ్లద్వారా తమ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న నిబద్ధత రుజువైందని స్పష్టం చేశారు.

బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న ప్రధాని నరేంద్ర మోదీ