జాతీయ వార్తలు

డాక్టర్ సరిపెల్లకు భారత్ భూషణ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ: కాకినాడకు చెందిన జ్యోతిష్యుడు డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తికి ‘్భరత్ భూషణ్’ అవార్డు ప్రదానం చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ సంస్థ ఈ అవార్డును మూర్తికి అందజేసింది. ఢిల్లీలోని ఛత్రాపుర్ ఎస్‌ఎకె శక్తిపీఠ్ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రామకృష్ణ శాస్ర్తీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. జ్యోతిష్యం వాస్తు, సంఖ్యాశాస్త్రం, హస్త సాముద్రికాలలో పరిశోధన చేసినందుకు ఏటా ఈ సంస్థ అవార్డులను అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

జాతీయవాదంపై
నినదించిన ఎబివిపి
ప్రత్యర్థులపై ఎదురుదాడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ‘రణ క్షేత్రం నుంచే జాతీయవాదం’ అనే నినాదంతో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపి సభ్యులు శనివారం న్యూఢిల్లీలో ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా ఎబివిపి సభ్యులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ‘డీమిలటరైజేషన్ ఆఫ్ నేషనలిజం’ అనే నినాదంతో వామపక్షాల గ్రూపు నావికాదళ మాజీ ప్రధానాధికారి లక్ష్మీనారాయణ్ రామ్‌దాస్, రిటైర్డ్ కల్నల్ లక్ష్మేశ్వర్ మిశ్రా తదితరులతో ఇప్పిస్తున్న ప్రసంగాలకు పోటీగా ఎబివిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘నేషనలిజం: స్ట్రైట్ ఫ్రమ్ బ్యాటిల్‌ఫీల్డ్’ అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్రిగేడియర్ శర్మ ప్రసంగిస్తూ, పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. రణ క్షేత్రంలో భారత్‌ను ఓడించడం అసాధ్యమని పాక్‌కు తెలుసని, అందుకే భారత్‌పై పరోక్ష యుద్ధాన్ని సాగిస్తూ మన అంతర్గత బలహీనతలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. భారత్ తనకంటే అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ స్వతంత్ర శక్తిగా అవతరించడం పాక్‌కు కంటగింపుగా పరిణమించిందని, కనుక మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉద్ఘాటించారు.

మరో జెఎన్‌యు విద్యార్థిని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన మరో విద్యార్థిని ఢిల్లీ పోలీసులు శనివారం విచారించారు. కన్హయ్య కుమార్‌కన్నా ముందు జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అషుతోశ్ పోలీసుల నుంచి సమన్లు రావడంతో శనివారం వారి ముందు హాజరయ్యారు. దేశద్రోహం కేసుకు సంబంధించి పోలీసులు అయిదుగురికోసం లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అయిదుగురిలో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఇదివరకే పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం రాత్రి సమన్లు అందుకున్న అషుతోశ్ శనివారం తనంత తానుగా ఆర్‌కెపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసుల ముందు హారయ్యారని ఒక పోలీసు అధికారి తెలిపారు. మరో ఇద్దరు రమ నాగా, అనంత్ కుమార్ ఇంకా సమన్లు అందుకోవాల్సి ఉంది. దర్యాప్తుకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు ఇదివరకే పోలీసులకు లేఖ రాశారు. పోలీసు గాలింపులు మొదలయ్యాక కనిపించకుండా పోయిన ఈ అయిదుగురు ఆదివారం రాత్రి తిరిగి జెఎన్‌యు క్యాంపస్‌కు చేరుకున్నారు. ఈ కేసులో కన్హయ్య కుమార్‌ను ఈ నెల 12న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు శుక్రవారం కన్హయ్య, ఖలీద్, అనిర్బన్‌లను మొదటిసారిగా కలిపి విచారించారు. ఈ విచారణలో ఈ నెల 9న క్యాంపస్‌లో నిర్వహించిన వివాదాస్పద కార్యక్రమంలో క్రియాశీలంగా పాల్గొన్న 22 మందిని పోలీసులు గుర్తించారు. జాతి వ్యతిరేక నినాదాలకు వేదిక అయిన ఈ వివాదాస్పద కార్యక్రమాన్ని అషుతోశ్, ఖలీద్, అనిర్బన్, మరికొంత మంది కలిసి నిర్వహించినట్లు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.
పోలీసు కస్టడీ పొడిగింపు
ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పోలీసు కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు వాదించడంతో వారి అభ్యర్థన మేరకు కోర్టు ఈ ఇద్దరి పోలీసు కస్టడీని పొడిగించింది. ఈ నెల 9న జెఎన్‌యు క్యాంపస్‌లో నిర్వహించిన వివాదాస్పద కార్యక్రమంలో పాల్గొన్న మరో 22 మందిని కన్హయ్య, ఖలీద్, అనిర్బన్‌ల ఇంటరాగేషన్‌లో గుర్తించామని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొంతమంది బయటి వ్యక్తులు కూడా పాల్గొన్నారని తెలిపారు.