జాతీయ వార్తలు

నాలుగేళ్లలో ఆచూకీ లేని 64,943 మంది పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత నాలుగేళ్లలో దాదాపు 60వేల మంది పిల్లల ఆచూకీ లభించడం లేదు. తప్పిపోతున్న పిల్లల్ని పసిగట్టి వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 2.5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధ్యం కావడం లేదు. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల మేరకు జనవరి 2012-్ఫబ్రవరి 2016 మధ్య కాలంలో 64,943 మంది పిల్లల ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు. దేశవ్యాప్తంగా 1,94,213 మంది పిల్లలు తప్పిపోగా, వారిలో 1,29,270 మంది పిల్లలను పసిగట్టి వారిని స్వస్థలాలకు చేర్పించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం, ఇంటి నుంచి పారిపోవడం, ఎత్తుకొనిపోవడం, కిడ్నాప్‌లు తదితర కారణాల వల్ల పిల్లలు కనిపించకుండా పోతున్నారు.
ఇలావుండగా పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువగా పిల్లలు కనిపించకుండాపోతున్నారు. నాలుగేళ్లలో ఈ రాష్ట్రంలో 44,095 మంది తప్పిపోగా, 36,055 మంది పిల్లలను పోలీసులు గుర్తించ గలిగారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 26,008 మంది తప్పిపోగా, 14,646 మంది ఆచూకీని పోలీసులు కనుగొనగలిగారు. తప్పిపోతున్న పిల్లల ఆచూకీ కనుగొనేందుకు ‘ట్రాక్‌చైల్డ్’, ‘ఖోయా-పాయా’ వంటి వెబ్ పోర్టర్లను అభివృద్ధి చేసి సంబంధిత మంత్రిత్ర శాఖ విశేషంగా కృషిచేస్తోంది. 2011-12లో ‘ట్రాక్‌చైల్డ్’ను రూపొందించగా, జూన్ 2015లో ‘ఖోయా-పాయా’ అనే మరో వెబ్‌పోర్టల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ పోర్టర్ల అభివృద్ధికోసం దాదాపు మూడు కోట్ల 11 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. పిల్లల సంరక్షణ పథకం కింద గత ఏడాది 2కోట్ల 50 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పోర్టర్ల అభివృద్ధిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోపాటు, రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా భాగస్వాములై తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ చేతనైన సహాయాన్ని అందిస్తున్నాయి. రైల్వే శాఖ 20 ప్రధాన స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనుగొనేందుకు విశేష కృషి చేస్తోంది.