జాతీయ వార్తలు

పాలమూరు, డిండిపై సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం మొదలెట్టిన డిండి ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కేంద్రం, కేంద్ర జల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రాజెక్టుల మూలంగా తమకు తీరని నష్టం జరుగుతోందని కృష్ణా, గుంటూరు రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిండి ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 90 టిఎంసిలు, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల వల్ల 30 టిఎంసిలు కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు నష్టపోతున్నారని, ఉన్నత మండలి అనుమతి లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 88, క్లాజ్ 8 కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొత్తగా చేపట్టబోయే ఏ ప్రాజెక్టుకైనా ఉన్నత మండలి నుంచి అనుమతి తిసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఎలాంటి అనుమతుల లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు ఇది వ్యతిరేకమని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు, కేంద్రానికి, కేంద్ర జల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.