జాతీయ వార్తలు

‘నవ’భారతానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవ‘సాయ’మే ప్రధానం

గ్రామీణ, సంక్షేమ, వౌలిక రంగాలకూ పెద్దపీట
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం
2016-17 బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ ప్రకటన

తొమ్మిది ప్రధానాంశాలు..
1.వ్యవసాయం అభివృద్ధి, రైతుల సంక్షేమం, 2.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి,గ్రామీణ ఉపాధి కల్పన,వౌలిక సదుపాయాల కల్పన.3.సామాజిక రంగం అభివృద్ధి , ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత, సామాజిక సంక్షేమం, ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యత. 4.విద్యా రంగంలో నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి కల్పన, భారత దేశాన్ని విజ్నాం ఆధారిక, ఉత్పాదక సమాజం రూపకల్పన. 5.వౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులను పెంచటం ద్వారా సామర్థ్య, జీవన నాణ్యత పెంచటం. 6.ఆర్థిక రంగంలో సంస్కరణలు తద్వారా పారదర్శకత,స్థిరత్వం పెంచటం.7. సుపరిపాలన,ప్రభుత్వం పని తీరును సులభతరం చేయటం,8. ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ నిధులను వివేచనతో నిర్వహించటం, అర్హులైన వారికి ప్రయోజనాలను అందజేయటం.9. పన్నుల రంగాన్ని సంస్కరించటం ద్వారా ప్రజలపై ప్రభుత్వ విశ్వాసం పెంచటం తమ బడ్జెట్ మూల స్తంభాలు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తొమ్మిది మూల స్తంభాల లాంటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా భారత దేశాన్ని పరివర్తన దిశగా మళ్లించే లక్ష్యంతో 2016-17 బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రతిపాదించారు. జైట్లీ వరుసగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తొమ్మిది అంశాలతో కూడిన ఎన్‌డిఏ ప్రభుత్వ ప్రధాన అజెండాను ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని అరుణ్‌జేట్లి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి పెద్ద పీట వేశారు. వచ్చే సంవత్సరం నుండి ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చు చూపించే విధానానికి స్వస్తి పలుకుతున్నామని ఆయన ప్రకటించారు. 2016-17 సంవత్సరానికి మొత్తం 19 లక్షల 78 వేల కోట్లతో కూడిన వార్షిక ప్రణాళికను అరుణ్‌జైట్లి ప్రతిపాదించారు. ఇందులో ఐదు లక్షల యాభై వేల కోట్లు ప్రణాళికా వ్యయం కాగా 14 లక్షల 28 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయమని జేట్లి వివరించారు. ప్రణాళికా వ్యయం 15.3 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. బడ్జెట్‌లో వ్యవసాయం, నీటిపారుదల, ఆరోగ్యం,మహిళా, శిశు సంక్షేమం ఎస్.సి, ఎస్.టి సంక్షేమం, గిరిజనుల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వౌలిక సదుపాయాల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రాలకు మొత్తం 99,681 కోట్లు బదిలీ చేస్తున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకానికి ఆత్యధికంగా 38,500 కోట్లు కేటాయించినట్లు జైట్లీ ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడీ పథకాన్ని అమలు చేయటం తెలిసిందే. యుపిఏ ప్రభుత్వం వైఫల్యానికి ఉపాధి కల్పనా హామీ పథకం సజీవ ఉదాహరణ అని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శించిన ఈ పథకానికి జేట్లి అత్యధిక నిధులు ఇవ్వటం గమనార్హం. రెవెన్యూ లోటు 2.5 శాతమని జైట్లి తెలిపారు. ఆదాయం పన్నులో ఎలాంటి మార్పు చేయలేదు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను రాయితీ రెండు వేల నుండి ఐదు వేల రూపాయలకు పెంచారు. అద్దె ఇళ్ళలో నివాసం ఉండే వారికి అద్దె మినహాయింపును 24 వేల నుండి 60 వేల రూపాయలకు పెంచారు. స్వంత ఇల్లు లేని, హెచ్ ఆర్‌ఏ పొందని ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయల బీమా కల్పించటంతోపాటు వయో వృద్దులకు 30 వేల రూపాయల అదనపు బీమా సౌకర్యం. కొత్తగా 62 నవోదయ పాఠశాలను ఏర్పాటు చేస్తారు. బహిరంగ మల విసర్జనను నిర్మూలించే గ్రామాలకు ప్రత్యేక అవార్డులను బహూకరించాలని నిర్ణయించినట్లు జైట్లి ప్రకటించారు. చిన్న దుకాణాల వారు ఏడు రోజుల పాటు వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పించారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని జైట్లి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. గృహ రుణాలపై వడ్డీ మినహాయింపును మరో 50 వేలు పెంచటంతోపాటు 60 చదరపు మీటర్ల విస్తీర్ణం లోపు ఇళ్లు, ప్లాట్లపై సేవా పన్నును మినహాయించారు. సంవత్సరాదాయం కోటి రూపాయలు దాటితే 15 శాతం సర్‌చార్జీ చెల్లించవలసి ఉంటుంది.
చిన్న కార్లపై ఒక శాతం, డిజిల్ కార్లపై రెండున్నర శాతం, పెద్ద కార్లపై నాలుగు శాతం సెస్సు విధించారు. బంగారం, బంగారు నగలపై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించారు. బ్రాండెడ్ రెడిమేడ్ బట్టలపై ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. పది లక్షల కంటే అధిక ధర ఉంటే విలాసవంతమైన కార్లపై నాలుగు శాతం అదనపు పన్ను విధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి చేసే విధంగా ఈ బడ్జెట్‌లో కూడా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను పది శాతం నుండి పదిహేను శాతానికి పెంచారు. ఎక్సేజ్ పన్ను పెంచటం వలన ఇక మీదట బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉన్నదని జైట్లీ ప్రకటించారు. తమ ప్రభుత్వం సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతోందని ఆయన ప్రకటించారు. దేశంలో ద్రవ్యోల్బణం 9 శాతం నుండి 5.4 శాతానికి తగ్గటంతోపాటు వృద్దిరేటు 7.6 శాతానికి చేరుకున్నదని జైట్లీ తమ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
దేశంలోని బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి మూడు అత్యంత ముఖ్యమైన పథకాలను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఇది వరకే ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని ప్రకటించిందంటూ దేశంలోని ఒకటింటా మూడు వంతుల మంది ప్రజల వైద్య ప్రయోజనాలను కాపాడేందుకు ఒక కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటిస్తున్నామని జేట్లి తెలిపారు.
పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు
ఐదు కోట్ల బిపిఎల్ కుటుంబాలన్నింటికి వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని జైట్లీ వెల్లడించారు. దీని వలన ఒక కోటి యాభై లక్షల మంది ఇంటి వారికి ప్రయోజనం కలుగుతుందని జేట్లి చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి 35,984 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నీటిపారుదల పథకం పరిధిలోకి అదనంగా మరో 28.5 లక్షల ఎకరాలను తెస్తామన్నారు. ఏఐబిపి కింద చేపట్టిన 89 నీటిపారుదల పథకాల నుండి 23 పథకాలను 2017 నాటికి పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 20 వేల కోట్లతో నీటిపారుదల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్దికి 19 వేల కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం వ్యవసాయ రుణాల కింద తొమ్మిది లక్షల కోట్లు ఇస్తారని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఏటిఎం, మైక్రో ఏటిఎంలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎరువుల పంపిణీకి సంబంధించిన రాయితీలను ఇక మీదట రైతుల ఖాతాలకు జమ చేసే విధానాన్ని అమలు చేస్తామని జైట్లీ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 5.35 లక్షల చౌక ధరల దుకాణాలున్నాయంటూ వీటిలో మూడు లక్షల దుకాణాలను ఆధునీకీకరిస్తామని ఆయన తెలిపారు. ఇక మీదట అమలు చేసే ప్రతి పథకం కాల పరిమితిని కూడా నిర్దారిస్తామని ఆయన ప్రకటించారు. మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసే వారికి సాలీనీ యాభై వేల రూపాయల వడ్డీ మినహాయింపు సౌకర్యం కల్పించారు. ఇంటి ధర యాభై లక్షలకు మించకుండా 35 లక్షల రుణం వరకు ఈ సౌకర్యం ఉంటుందిన జేట్లి తెలిపారు.

ఏపి, తెలంగాణకు కేటాయంపులు

ఊసేలేని హోదా!

రెవెన్యూ లోటు భర్తీకి హామీ లేదు
పన్నులు రాయితీల కింద 24,637 కోట్లు కేటాయింపు
గత ఏడాదికంటే 2,747 కోట్లు అధికం

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రతిపాదించిన 2016-17 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రకు వివిధ పన్నులు, రాయితీల కింద 24,637.36 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల పునర్విభజన సందర్భంలో ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉన్నట్టు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలూ అమలు చేస్తామన్నారు. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై జేట్లీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధి, అమరావతి నిర్మాణానికి ప్రత్యేక నిధులు ప్రకటించలేదు. కేంద్రానికి సంబంధించిన వివిధ పన్నులు, రాయితీల్లో ఆంధ్ర వాటా 4.305 శాతం. ఆంధ్రకు కార్పొరేషన్ పన్నుల వాటా కింద 7,729.34 కోట్లు, ఆదాయ పన్ను వాటాగా 5,990.02 కోట్లు, ఆస్తి పన్ను వాటా కింద 23 లక్షలు, కస్టమ్స్ పన్నుల వాటా కింద 3,851.29 కోట్లు, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ వాటా కింద 3,077.09 కోట్లు, సేవల పన్నుల వాటాగా 3,989.86 కోట్లు లభించాయి. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే ప్రస్తుత కేటాయింపులు 2,747 కోట్లు అధికం. గత ఏడాది ఆంధ్రకు కేంద్ర పన్నులు, రాయితీల వాటా కింద 21,893.79 కోట్లు లభించాయి. ఇదిలావుంటే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 106 కోట్లు, ట్రిపుల్ ఐటిలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటికి 40 కోట్లు, విశాఖపట్నం ఐఐఎంకు 30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటికి 40 కోట్లు, తిరుపతి ఐఐఎస్సీఆర్‌కు 40 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంటుకు 1,678 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టుకు 231.61 కోట్లు కేంద్రీయ వర్శిటీకి కోటి రూపాయలు కేటాయించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు 15 కోట్లు ఇచ్చారు.
ఇదిలావుంటే, విభజన చట్టం హామీల అమలుకు ఎన్డీయే హామీ ఇచ్చిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేశారన్నారు. విభజన చట్టంలోని చాలా హీమీలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగతావి కూడా అమలవుతాయన్నారు. ఇదిలావుంటే లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదన జరగగానే తెలుగుదేశం ఎంపీలు హుటాహుటిన పార్లమెంటు ఆవరణలోని అరుణ్ జైట్లీ కార్యాలయానికి వెళ్లి వార్షిక ప్రణాళికలో తాముకోరిన కేటాయింపులను చేర్చకపోవటం గురించి వాకబు చేశారు. విభజన చట్టం హామీలు, ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఇచ్చిన హామీని జైట్లీ చూపించటంతో ఎంపీలు శాంతించారు.

విదిల్చింది
తక్కువే

పన్నులు, రాయితీల
వాటాగా 13,955 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే
1,605 కోట్లు అధికం
విభజన చట్టం హామీలు
నెరవేరుస్తామని హామీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రతిపాదించిన 2016-17 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర పన్నులు, రాయితీల వాటా కింద 13,955.35 కోట్లు ప్రకటించారు. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే ఇది 1,605 కోట్లు అధికం. గత ఏడాది కేంద్ర పన్నులు, రాయితీల కింద రాష్ట్రానికి 12,350.72 కోట్లు కేటాయించారు. ఆంధ్ర మాదిరిగానే తెలంగాణకూ బడ్జెట్‌లో ఆశించినంతగా నిధులు కేటాయించలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయటంతోపాటు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీల హామీని నెరవేరుస్తామని మాత్రమే జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలావుంటే బడ్జెట్‌లో గిరిజన వర్శిటీకి కోటి, రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఐఐటికి 20 కోట్లు, మరో పథకానికి 15 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇదిలావుంటే జైట్లీ బడ్జెట్ ప్రసంగం అనంతరం తెరాస ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి, విశే్వశ్వరరెడ్డి, బి వినోద్‌కుమార్, బిబి పాటిల్, ప్రభాకర్ రెడ్డి, బూర నరసయ్యగౌడ్, జి నగేష్‌లు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిసి వరద కాల్వ పథకాన్ని ఏఐబిపి కింద చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..

కలలను నెరవేర్చే బడ్జెట్

ప్రథాని మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చేవిధంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రజల కలలను సాకారం చేసే దిశగానే ఈ బడ్జెట్ బలమైన అడుగు వేసిందని అన్నారు. గ్రామాలు, పేదలు, రైతులు, మహిళలు, యువతపై దృష్టి పెట్టడం ద్వారా సమాజంలో గుణాత్మకమైన మార్పులకు ఈ బడ్జెట్ నాంది పలికిందన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో అమలుచేసే రీతిలో చేసిన ప్రతిపాదనలు పేదరిక నిర్మూలనకు దోహదం చేస్తాయన్నారు.
వ్యవసాయం, గ్రామీణ వౌలిక సదుపాయాలు, ఆరోగ్య రంగం, ఉపాధి కల్పన, దళితులు, గిరిజనులు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశాలు కల్పించడం వంటివి ఉదాత్తమైన ప్రతిపాదనలని అన్నారు. ‘ఈ బడ్జెట్ మీ కలలకు చేరువగా ఉంది. మీ ఆశయాలకు ఉద్దీపన పట్టేదిలా ఉంది. అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం కూడా నిబద్ధతను చాటుకుంది’ అని మోదీ అన్నారు. గ్రామీణ జీవనంలోనూ, రైతులు, పేదలు, మహిళలు, యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక కేటాయింపులు జరిగాయని, అవన్నీ కూడా వీరి జీవనంలోనూ, జీవితంలోనూ ఆశావహ మార్పులు తీసుకొస్తాయని తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలో పేదరిక నిర్మూలనకు రోడ్ మ్యాప్ వేయడం ప్రశంసనీయమన్నారు. విద్యుత్, రహదారుల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలకు అత్యవసరమని, 2019 నాటికల్లా అన్ని గ్రామాలను రహదారులతో సంధానం చేస్తామని, 2018 నాటికి అన్నింటికీ విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.
దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త శక్తి లభిస్తుందని, సామాన్యుని జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి గరిష్ఠ స్థాయిలో కేటాయింపులు జరపడమే ఇందుకు నిదర్శనమన్నారు. పేదలపై ఇప్పటివరకు ఎన్నో రాజకీయాలు జరిగాయని, వాటికి స్వస్తి పలికి వారి జీవితాలను ఉద్ధరించాలన్నదే తమ ఆశయమన్నారు. వౌలిక సదుపాయాల రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం వల్ల దేశ సరిహద్దు ప్రాంతాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలకు కూడా ఊతం లభించిందన్నారు. దళితులు, ఆదివాసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారని, ఏదో ఉద్యోగం చేయడం కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న తపన వారిలో పెరుగుతోందన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

మాటలు ఘనం..

విరుచుకుపడ్డ విపక్షాలు

న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ అన్నివిధాలుగా పేదలకు ప్రయోజనాన్ని కలిగించేదేనంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను విపక్షాలు తీవ్ర పదజాలంతో ఖండించాయి. ఇది కేవలం మాటల గారడీయేనని, శుష్క వాగ్దానాలతో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నాయి. ఉపాధి కల్పన సహా ఆర్థికంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను పరిష్కరించే మార్గాలను ఆవిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. మొత్తం బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ ఆలోచన అంటూ ఏదీ లేదని పేర్కొన్నాయి.
గత రెండు బడ్జెట్లలో ఇచ్చిన హామీల సంగతిని మరిచి కొత్తగా మరిన్ని వాగ్దానాలనే తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ యువ నేత రాహుల్‌గాంధీ అన్నారు. మొదటి రెండేళ్లలో ప్రధాని మోదీ చేసింది కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే తప్ప మరేమీ కాదని, యుపిఏ ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి, సామాజిక కేటాయింపులు పెంచడం వంటి వాటిని బిజెపి సర్కార్ విమర్శించిందని తెలిపారు. ఓ స్పష్టమైన దృష్టి, దృక్పథం లేకుండా రైతులకు గానీ, పేదలకు గానీ ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అంధులకు ఎంతగానో ఉపయోగపడే బ్రెయిలీ పేపర్‌పై దిగుమతి సుంకాన్ని తొలగించాలన్న తన ప్రతిపాదనను అంగీకరించినందుకు ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌లో అన్నీ కూడా మొక్కుబడి చందంగానే ఉన్న హామీలేనని, పరోక్ష పన్నుల పోటు ద్వారా సామాన్యులపై భారం వేశారని సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేవలం హామీలు, నినాదాలే తప్ప ఆచరణయోగ్యత పూజ్యమన్నారు.

దేశ పురోభివృద్ధికి దోహదం: వెంకయ్య

న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశ పురోభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బడ్జెట్ దేశ పట్టుకొమ్మలయిన గ్రామాలకు, పెదలకు , రైతులకు , మహిళలకు ,యువతకు పెద్దపీట వేశారని, అన్నీ పరిగణలోకి తీసుకొని సమతుల్యంగా రూపొందించారన్నారు. ప్రధాని మోడీ అలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని గృహనిర్మాణానికి,పేదరిక నిర్మూలనకు రాయితీలు,ప్రోత్సహకాలు ఇవ్వడం శుభపరిణామం అన్నారు.

వ్యవసాయానికి పెద్దపీట: దత్తాత్రేయ

న్యూఢిల్లీ: వ్యవసాయనికి పెద్దపీట వేయడంతో పాటుగా ,్భరత ఆర్థిక వ్యవస్థ బలోపెతం అవ్వడానికి ఈ బడ్జెట్ అన్ని విధాలుగా ఉపయోగ పడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేప్పారు. వౌళిక సాదుపాయాల కల్పన ,రోడ్లు, రహదారులు ,రైల్వేకి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చారని, రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతోందన్నారు. కార్మికులకు, ఉపాది కల్పన నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.

మధ్యతరగతికి ప్రాధాన్యం: కవిత

న్యూఢిల్లీ: ఈ బడ్జెట్ వ్యవసాయానికి ,మధ్యతరగతికి ప్రాధాన్యం ఇవ్వడం హర్షించ దగ్గ విషయం అని నిజామాబద్ ఎంపీ కవిత అన్నారు. కొత్త రాష్ట్రం ఆయిన తెలంగాణ రెండు సంవత్సరాలుగా కరువుతో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నదున రైతులను ఏవిధంగా అదుకొంటారో బడ్జెట్ లో చేప్పలేదన్నారు. వ్యవసాయానికి ప్రాధన్యం ఇవ్వడం పై సంతోషం వ్యక్తం చేసిన కవిత మహిళలకు తక్కువ ప్రాధన్యం ఇచ్చారన్నారు. కరువు రాష్టల్రకు నిధులు ఇస్తే బాగుండేదని ,పెద రైతులకు అదుకోవడం మంచి పరిణామం అన్నారు. మహిళా ఉద్యోగులకు రూ.6 లక్షలు పన్నుమినహాయింపు ఇస్తే బావుండేది అని కవిత చేప్పారు.

80శాతం ప్రజలకు దూరం: విశే్వశ్వరరెడ్డి

న్యూఢిల్లీ: ఈ బడ్జెట్ తెలంగాణకు పూర్తి నిరాశ కల్గించిదని ,విభజన చట్టం రాష్టన్రికి రావల్సిన నిధులు కెటాయింపులు జరతీలేదని ఎంపి విశే్వశ్వరరెడ్డి అన్నారు.క్రూడ్ ఆయిల్ సిమెంట్ ,ఐరెన్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతూంటే దాని ప్రభవం ఈ బడ్జెట్ లో లేదని ఆయన చేప్పారు. 20శాతం ప్రజలకు ఈ బడ్జెట్ దగ్గర అయ్యేలా ఉందే తప్పా 80 శాతం ప్రజలకు దురంగా ఉందని విమర్శించారు.

ఏపికి హోదాపై నిరాశే: మేకపాటి

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యక హోదాపై ప్రకటన చేయకపోవడం నిరాశ కల్గిచిందని వైకాపా ఎంపీ రాజమోహనరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్ లో రైల్వేజోన్ పై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొన్నారని ఇప్పడు మారోసారి కేంద్రం నిరాశ కల్గించిందన్నారు. వ్యవసాయానికి ప్రాధన్యం ఇవ్వడం హర్షించదగ్గా విషయం అన్నారు.

ఏపికి అన్యాయం: వై.వి.సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా లాంటి హామీలను ఈ బడ్జెట్ ప్రస్తావించక పోవడం దారుణమని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ కుపూర్తిగా నిరాశ కల్గిందన్నారు.

ప్రజల నోట్లో మట్టి: విహెచ్

న్యూఢిల్లీ: 2016-17 ఆర్ధిక బడ్జెట్ ఆంధ్ర ,తెలంగాణ ప్రజల నోట్లో ఏన్డీయే ప్రభుత్వం మట్టి కోట్టిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు విమర్శించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిధులు విడుదల చేయ్యకపోవడం కేంద్రానికి కొత్త రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.

సామాన్యుడికి ఊరట: హరిబాబు

న్యూఢిల్లీ,: సామాన్యుడికి ,రైతు సంక్షేమానికి బడ్జెట్ దోహదం చేస్తుందని ఎంపీ హరిబాబు అన్నారు. ఏపిని కేంద్రం ఆదుకుంటుందని, అన్ని రంగాలలో సముచిత న్యాయం చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

మహిళలకు చేయూత: తోట

న్యూఢిల్లీ: ఈ బడ్జెట్ వ్యవసాయానికి ,రైతులకు ,మహిళలకు యువతకు ప్రోత్సహమిచ్చేలా ఉందని కాకినాడ ఎంపీ తోట నర్సింహం అన్నారు. అన్ని రంగాలలోని ప్రజలకు ,ఉపాది కల్పన ప్రజాల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందన్నారు.