జాతీయ వార్తలు

ప్రాధాన్యతాక్రమంలోనే ప్రభుత్వ వ్యయం.. అరుణ్ జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సులను, రక్షణ శాఖ సిబ్బందికి ఒకే ర్యాంకు-ఒకే పింఛను పథకాన్ని అమలు చేసే అదనపు భారం ఉన్నందున ప్రభుత్వం వచ్చే వార్షిక సంవత్సరం ప్రాధాన్యతాక్రమంలో వ్యయం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ వ్యయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం తీవ్రమైన సవాళ్లని ఆయన పేర్కొన్నారు. ఏడో వేతన సంఘం, ఒఆర్‌ఒపిల వల్ల ప్రభుత్వ వ్యయానికి ప్రాధాన్యత క్రమాన్ని ఏర్పరచుకోవలసిన అవసరం ఏర్పడిందని ఆయన సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చెప్పారు. వేతన సంఘం, ఒఆర్‌ఒపిలను అమలు చేయడానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాపై రూ. 1.10 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పిన విషయం తెలిసిందే. పన్నుల్లో కేంద్రం వాటా బాగా తగ్గినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చలనశీలత గల రెవిన్యూ వల్ల ప్రభుత్వం తన బడ్జెట్ వ్యయాన్ని మెరుగుపరచ గలిగిందని జైట్లీ వివరించారు.

లోక్‌పాల్, సివిసికి ఊరట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: అవినీతి నిరోధక సంస్థలయిన లోక్‌పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి)లకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో లోక్‌పాల్‌కు రూ. 8.58 కోట్లు, సివిసికి రూ. 27.68 కోట్లు కేటాయించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో లోక్‌పాల్‌కు రూ.7.18 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు దాదాపు 19.49 శాతం పెరిగాయి.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లోక్‌పాల్‌కోసం రూ.24.26 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులను 14 శాతం పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రంలో లోకాయుక్తలను ఏర్పాటు చేయడానికి లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013 వీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఒక సవరణ బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న కారణంగా కేంద్రం స్థాయిలో లోక్‌పాల్‌ను ఇంకా ఏర్పాటు చేయలేదు.

బడ్జెట్ పత్రాలతో నార్త్‌బ్లాక్ నుంచి బయలుదేరిన
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

సబ్సిడీల బిల్లు
4 శాతం పైగా కుదింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై ఇస్తున్న రాయితీలను కేంద్ర ప్రభుత్వం 4 శాతానికి పైగా కుదించింది. సవరించిన అంచనాల ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,856.58 కోట్ల రాయితీలు ఇచ్చిన ఈ మూడు రంగాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో రూ.2,31,781.61 కోట్ల రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో ప్రతిపాదించారు. సవరించిన అంచనాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఆహారంపై రూ.1,39,419 కోట్ల రాయితీ ఇవ్వగా, ఈసారి వాటిని 1,34,834.61 కోట్ల రూపాయలకు, అలాగే ఎరువులపై రాయితీని రూ.72,437.58 కోట్ల నుంచి రూ.70 వేల కోట్లకు, పెట్రోలియంపై రాయితీని రూ.30 వేల కోట్ల నుంచి 26,947 కోట్ల రూపాయలకు తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.