జాతీయ వార్తలు

పోలవరం పూర్తిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢిల్లీకి ఆహ్వానించామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. ఉమాభారతి మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నదుల అనుసంధానం, నీటిపారుదల సౌకర్యాలను పెంచేందుకు తమ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సరస్వతీ నదిపై జరుగుతున్న పరిశోధన తదితర ఆంశాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుండి 1600 కోట్లు తీసుకునే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పోలవరం డ్యాం ఎత్తును పెంచటం సాధ్యం కాదని ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 2016-17 సంవత్సరం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించామని వివరించారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,600 కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నామని, ఈ మొత్తాన్ని నాబార్డ్ నుండి తీసుకునే అవకాశం ఉన్నదని ఉమాభారతి తెలిపారు. తెలంగాణలో మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన కేంద్ర పథకాల నుండి నిధులు అందజేస్తామని ఉమాభారతి తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కాలుష్య నివారణ, భూగర్భ జలాల రీచార్జ్ సాధిస్తామని ఆమె ప్రకటించారు. పోలవరం దేశం గర్వించ దగిన ప్రాజెక్టు అని ఆమె ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు ఎక్కడ సరిపోతాయని ఒక విఖకరి ప్రశ్నంచగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ డిమాండ్ చేసినంత మేర బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని మంత్రి జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు అథారిటీ ఏర్పాటు చేశామన్న ఉమాభారతి ప్రాజెక్టుకు అధిక నిధులు సంపాదించేందుకు తమ శాఖ ఆధికారులు నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నారని ఆమె తెలిపారు. పోలవరానికి ఎక్కువ నిధులు కేటాయించాలని తమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాయన్నారు. తాము అడిగినన్ని నిధులు లభిస్తాయని ఆశిస్తున్నామని ఉమాభారతి చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం కేటాయించిన 20 వేల కోట్ల నుండి పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకునే అవకాశం ఉందన్నారు. చంద్రబాబుకు గత వారం టెలిఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో ఎలా పూర్తి చేయాలనే అంశంపై ఆయనతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఉమాభారతి తెలిపారు. మిషన్ కాకతీయ పథకం లాంటి ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా అమలు చేయాలనుకుంటున్నాయని ఆమె వెల్లడించారు. మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమని మంత్రి ప్రశంసించారు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో చెరువులు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయటం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని ఆమె స్పష్టం చేశారు. చెరువులను అభివృద్ధి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సూచించారని ఆమె గుర్తుచేశారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని గతంలో అనుకున్నా ఇప్పుడు మాత్రం ఒక అంగుళం కూడా పెంచకూడదనే నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఒడిషా కూడా ఆమోదం తెలిపింది’అని ఆమె వెల్లడించారు.