జాతీయ వార్తలు

పార్లమెంటులో వాయిదాల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్ మాక్సిస్ కుంభకోణానికి బాధ్యుడైన మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిక్ చిదంబరంపై చర్య తీసుకోవాలంటూ అన్నా డిఎంకె సభ్యులు, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై తామిచ్చిన సభా హక్కుల తీర్మానం ఏమైందంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో పార్లమెంటు ఉభయసభలు మంగళవారం గందరగోళం మధ్య కొద్దిసేపు కొనసాగిన అనంతరం బుధవారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలు అంతకు ముందు పలుమార్లు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే అన్నా డిఎంకె సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిక్‌పై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ వారికి నచ్చ జెప్పేందుకు తీవ్రంగా కృషి చేశారు. స్పష్టమైన వివరాలతో నోటీసు ఇస్తే చర్చకు అనుమతి ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు లేచి సభ్యులు నోటీసు ఇస్తే చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినా అన్నా డిఎంకె సభ్యులు మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా పోడియం చుట్టూ నిలబడి చిదంబరం, కార్తిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో సుమిత్రా మహాజన్ తొలుత సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే ఆమె ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పోడియం వద్దకు దూసుకు వచ్చిన అన్నా డిఎంకె సభ్యులు మళ్లీ నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. స్పీకర్ సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించ లేదు. దీంతో ఆమె సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేయవలసి వచ్చింది. మధ్యాహ్నం మూడోసారి సభ సమావేశమైనప్పుడు స్పీకర్ అన్నా డిఎంకె సభ్యులకు తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి స్మృతి ఇరానీపై తామిచ్చిన సభా హక్కుల తీర్మానం ఏమైందంటూ నినాదాలు ఇచ్చి సభను స్తంభింపజేశారు. అన్నా డిఎంకె నాయకుడు వేణుగోపాల్ మాట్లాడేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ సభ్యుల గొడవ మూలంగా అది సాధ్యం కాలేదు. దీనితో అన్నా డిఎంకె సభ్యులు మరోసారి పోడియం వద్దకు వచ్చి గొడవ చేయసాగారు. స్మృతి ఇరానీపై కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ చీప్‌విప్ జ్యోతిరాదిత్య సింధియాపై బిజెపి సభ్యుడు మేఘవాల్, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన సభా హక్కుల తీర్మానాలు తన పరిశీలనలో ఉన్నాయని సుమిత్రా మహాజన్ వివరించారు. కాంగ్రెస్, అన్నా డిఎంకె సభ్యులు ఇదేదీ పట్టించుకోకుండా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. దీంతో సభ పూర్తిగా గందరగోళంలో పడిపోవటంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను బుధవారం ఉదయం వరకు వాయిదా వేయవలసి వచ్చింది.
రాజ్యసభలోనూ ఇదే గొడవ
అన్నా డిఎంకె సభ్యులు సీనియర్ నాయకుడు మేత్రేయన్ నాయకత్వంలో పోడియం వద్ద నిలబడి చిదంబరం, కార్తిక్ చిదంబంపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ నినాదాలు ఇస్తూ రాజ్యసభను స్తంభింపజేశారు. సభ ఉదయం సమావేశం కాగానే అన్నా డిఎంకె సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి నినాదాలు ఇస్తూ గొడవ చేశారు. ఉపసభాపతి పి.జె.కురియన్ వారిని శాంతపరిచి జీరో అవర్ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారు పోడియం వద్ద నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ గొడవ చేశారు. దీనితో కురియన్ సభను మొదట పది నిమిషాలు, ఆ తరువాత మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. సభ పనె్నండు గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు కూడా అన్నా డిఎంకె సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. చైర్మన్ హమీద్ అన్సారీ వారిని శాంతపరిచేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సభ్యుల నినాదాల మధ్యనే సభను నిర్వహించేందుకు ఆయన గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో సభను వాయిదా వేయక తప్పలేదు. సభ పలు మార్లు వాయిదా పడి చివరకు సాయంత్రం మూడు గంటల సమయంలో బుధవారానికి వాయిదా పడింది.

చిత్రం... లోక్‌సభలో వెల్‌లోకి వచ్చి నినాదాలిస్తున్న అన్నాడిఎంకె సభ్యులు.