జాతీయ వార్తలు

తగాదా కేంద్రమే తీర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆస్తుల విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదాన్ని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం అభిప్రాయపడింది. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోపాల గౌడ, న్యాయమూర్తి అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రం విడిపోయిన ఒక సుంవత్సరంలో ఈ సమస్యను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి లేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సమావేశమై ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ రంజీత్ కుమార్ కోర్టుకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆస్తుల ఖాతాల కేసుపై సుదీర్ఘంగా సాగిన వాదనల్లో పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణా వాదించింది. జనాభా నిష్పత్తిలో ఆస్తుల పంపకాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ వాదించింది. సెక్షన్ 75 ప్రకారం ఆస్తులు, ఖాతాలు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే చెందుతాయని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ప్రాంతీయ స్థాయి ఉన్న సంస్థలే ఆ రాష్ట్రానికి చెందుతాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పి.పి.రావు, బసవ ప్రభు వాదించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 52(2) ప్రకారం ఆస్తులను జనాభా ప్రాతిపదికలపై పంచాలని వారు వాదించారు. కేవలం సేవలను మాత్రమే అందిస్తామనటం సహేతుకం కాదని వారు కోర్టుకు వివరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది అంధ్యార్జున వాదిస్తూ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయనీ, చట్టంలోని 10వ షెడ్యూలు సైతం ఇదే విషయం చెబుతోందని స్పష్టం చేశారు. సెక్షన్ 75 ప్రకారం ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు పంచేందుకు వీలులేదని, కేవలం సేవలు మాత్రమే అందిస్తామని రామకృష్ణారెడ్డి, అంధ్యార్జున తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంస్థల ఆస్తులను పంచాలని తాము కోరడం లేదంటూ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని వారు ఉదహరించారు. నగదు మినహా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థల ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని వారు కోర్టుకు వివరించారు. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సమావేశపరిచి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించిందని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ రంజీత్ కుమార్ కోర్టుకు తెలిపారు. అవిభాజ్య రాష్ట్రం వెలుపల ఆస్తులుంటే జనాభా ప్రాతిపదికపై 52, 48 నిష్పత్తిలో పంచుకోవాలని ఆయన కోర్టుకు తెలియజేశారు. సెక్షన్ 75 ప్రకారం ఆస్తులు, అప్పులు పంచేందుకు వీలు లేదనే కేంద్ర ప్రభుత్వం వైఖరిని రంజిత్ కుమార్ కోర్టుకు వివరించారు.
రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోపాల గౌడ, న్యాయమూర్తి అరుణ్ మిశ్రాలు అన్ని సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆస్తుల పంపకానికి ఇది సరైన మార్గం కాదని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు తమ తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఒక సంవత్సర కాలం ఈ సమస్యను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోలేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విభజన చట్టంలో ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేయటం గమనార్హం.