జాతీయ వార్తలు

మళ్లీ దీక్ష ప్రారంభించిన షర్మిలా చాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఆఫ్‌స్పా)ను ఉపసంహరించాలంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న ఇరోమ్ షర్మిలా చాను తన దీక్షను మళ్లీ ప్రారంభించారు. ఆఫ్‌స్పా రద్దుకు మణిపూర్‌కు చెందిన హక్కుల కార్యకర్త షర్మిల 15 ఏళ్లనుంచి నిరాహారదీక్ష చేస్తున్న విషయం విదితమే. ఆత్మహత్య కేసులో కోర్టు నిర్దోషిగా నిర్ధారించడంతో సోమవారం జ్యుడీషియల్ కస్టడీనుంచి షర్మిలకు విముక్తి లభించింది. జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డు నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇక్కడి చారిత్రక షాహిద్ మినార్ వద్దకు చేరుకుని తిరిగి తన దీక్షను పునఃప్రారంభించారు. ఆఫ్‌స్పా రద్దు చేసేవరకూ తన దీక్ష కొనసాగుతుందని విలేఖరులకు చెప్పిన షర్మిల, రాష్ట్రంలో నెలకొన్న అశాంతికి హింస పరిష్కారం కాదని, అహింసా మార్గమే ఈ సమస్యకు పరిష్కారమని వెల్లడించారు.