జాతీయ వార్తలు

పార్లమెంటులో ‘హక్కుల’ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు సభాహక్కుల తీర్మానాలు ఇచ్చారు. మంగళవారం దీనిపై ఇరుపక్షాల నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు తాను రాసిన లేఖ కారణమంటూ కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాధిత్య సింధియా చేసిన ఆరోపణలను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తోసిపుచ్చారు. దత్తాత్రేయ లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ జ్యోతిరాధిత్య నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. హెచ్‌సియు వ్యవహారాలపై తాను కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖలో ఎక్కడ కూడా రోహిత్ వేముల పేరు ప్రస్తావించలేదని వివరించారు. స్మృతి ఇరానీకి లేఖ రాసినందుకే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రతిపక్షం ఆరోపించటం పూర్తిగా సత్యదూరమని ఆయన అన్నారు. తానూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినేనని వారి ప్రయోజనాల కోసమే పని చేస్తాననేది అందరికీ తెలిసునని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బిజెపి సభ్యుడు అర్జున్ రాం మేఘవాల్ మాట్లాడుతూ ‘జ్యోతిరాధిత్య ఫిబ్రవరి 24న లోక్‌సభలో కార్మిక మంత్రి దత్తాత్రేయపై విమర్శలు చేశారు. రోహిత్ వేములను దత్తాత్రేయ కులతత్వవాది, తీవ్రవాది, సంఘ వ్యతిరేకి అన్నారని ఆరోపించారు’ అని మేఘవాల్ చెప్పారు. హెచ్‌ఆర్‌డి మంత్రికి రాసిన లేఖలో స్కాలర్‌పై దత్తాత్రేయ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిజెపి సభ్యుడు తెలిపారు. దత్తాత్రేయపై తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా సింధియా లోక్‌సభను తప్పుదోవ పట్టించారని, అందుకే ఆయనపై సభా హక్కుల నోటీసు ఇచ్చానని వెల్లడించారు. తరువాత దత్తాత్రేయ మాట్లాడుతూ జ్యోతిరాధిత్యపై తాను 223 నియమం ప్రకారం ఇచ్చిన సభా హక్కుల తీర్మానం ఏమైందని ప్రశ్నించారు. గత 30 ఏళ్ల నుంచి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తానెంతోపాటుపడుతున్నానని ఆయన అన్నారు. ‘మా అమ్మ ఉల్లిపాయలు అమ్ముతూ వచ్చిన ఆదాయంతో నన్ను పెంచి పోషించింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను ఒకరి మరణానికి కారణమని ఆరోపించడం దారుణం’ అని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించిన జ్యోతిరాధిత్యపై ఇచ్చిన సభా హక్కుల తీర్మానాన్ని చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సుమిత్రా మహాజన్ రూలింగ్ ఇస్తూ జ్యోతిరాధిత్యపై వచ్చిన సభా హక్కుల తీర్మానాలు తన పరిశీలనలో ఉన్నాయని, తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా రోహిత్ వేముల ఆత్మహత్యపై సభను తప్పుదోవపట్టించిన మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై తామిచ్చిన సభా హక్కుల నోటీసు ఏమైందని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. వారంతా వెల్‌లోకి దూసుకొచ్చి ఇరానీపై సభాహక్కుల తీర్మానంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు కెసి వేణుగోపాల్ స్పీకర్‌కు రూల్‌బుక్ చూపిస్తూ తీర్మానం గురించి నిలదీశారు. దీనిపై తీవ్రంగానే స్పందించిన స్పీకర్ ‘రూల్ బుక్ నాకు చూపించనక్కర్లేదు. బుక్ సంగతి నాకు తెలుసు’ అన్నారు.
రాజ్యసభలోనూ రోహిత్ ఆత్మహత్యపై అట్టుడికింది. స్మృతి ఇరానీపై తాము ఇచ్చిన హక్కుల తీర్మానంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ ప్రశ్నించారు. ‘స్మృతి ఇరానీ సభనే కాకుండా జాతినే తప్పుదోవ పట్టించారు. ఇక్కడే కాదు, దేశాన్ని, ఉభయ సభలను తప్పుదోవపట్టించారు. హెచ్‌ఆర్‌డి మంత్రి తీరు చాలా తీవ్రమైంది’ అని ఆజాద్ స్పష్టం చేశారు. తొలుత కాంగ్రెస్ సభ్యుడు భాల్‌చంద్ర ముంగేకర్ మాట్లాడుతూ స్మృతి ఇరానీపై సోమవారం తాను ఇచ్చిన సభా హక్కుల తీర్మానం విషయాన్ని లేవనెత్తారు. మరోపక్క ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీపై చర్యలు తీసుకోవాలని అన్నాడిఎంకె సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై అన్నాడిఎంకె, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

పార్లమెంటు వెలుపల సందర్శకులతో కరచాలనం చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
మరో వివాదంలో చిక్కుకున్న ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్న ట్రంప్