జాతీయ వార్తలు

డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముంబయి డాన్స్‌బార్ల యజమానులకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. డాన్స్‌బార్ల నుంచి సిసిటివి ఫుటేజ్ పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనను కోర్టు తిరస్కరించింది. వీటికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు సవరించిన సుప్రీం కోర్టు డాన్స్ బార్లకు పది రోజుల్లో లైసెన్స్‌లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం డాన్స్ బార్ల యాజమానులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సవరించిన బెంచ్ మూడు రోజుల్లో వాటిపై అభిప్రాయం తెలియజేయాలని బార్ యాజమాన్యాన్ని ఆదేశించింది. పది రోజుల్లో డాన్స్ బార్లకు లైసెన్సులు మంజూరు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ‘సిటిటివిల ఏర్పాటుకు సంబంధించి మేం కొన్ని మార్పులను చేశాం. సిసిటివి కెమెరాలు రెస్టారెంట్ లోపల లేదా డాన్స్‌లు జరుగుతున్నచోట ఏర్పాటును మేం అనుమతించబోము. వాటిని ఎంట్రెన్స్‌లోనే ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వాన్ని ఆదేశించాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెనక సదుద్దేశం ఉందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. డాన్సర్లు భద్రతకోసమే సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని భావించినట్టు ఆయన కోర్టుకు తెలిపారు.
అలాగే బార్ల లాబీలు, ప్రవేశద్వారాల వద్ద మాత్రమే కెమెరాలు పెట్టాలనుకున్నామే తప్ప డాన్స్ జరిగే ప్రాంతంలో కాదని పింకీ ఆనంద్ స్పష్టం చేశారు.

బస్తర్‌లో లొంగిపోయిన 23 మంది నక్సల్స్

రాయపూర్, మార్చి 2: చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో బుధవారం 23 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ నాయకులు పాల్పడుతున్న హింసాత్మక, అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలతో విసిగిపోయి తాము లొంగిపోతున్నట్లు, పోలీసు జిల్లా ఉన్నతాధికారుల ముందు లొంగిపోయిన నక్సల్స్ చెప్పినట్లు బస్తర్ జిల్లా ఎస్పీ ఆర్‌ఎన్ దాష్ చెప్పారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు విధానం కూడా తమకెంతో నచ్చిందని వారు చెప్పినట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు- కమలేశ్ నాగ్, తులసీరామ్ నాగ్, కుమార్ కశ్యప్‌ల ఒక్కొక్కరి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించినట్లు ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిలో జన మిలీషియా డిప్యూటీ కమాండర్ ప్రమోద్ ఠాకుర్ కూడా ఉన్నట్లు దాష్ చెప్పారు. మిగతా వారంతా మావోయిస్టు పార్టీకి చెందిన కిందిస్థాయి కేడర్ అని ఆయన తెలిపారు. లొంగిపోయిన వారందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులున్నాయని ఎస్పీ చెప్పారు. అంతేకాదు లొంగిపోయిన వారిలో 14 మందికి బ్యాంక్ ఖాతాలున్నాయని, 20 మందికి ఓటరు ఐడి కార్డులుండగా, నలుగురు ఇందిరా ఆవాస్ యోజన లబ్ధిదారులని కూడా ఆయన తెలిపారు. అమాయక ప్రజలను తీవ్రవాదులుగా ముద్ర వేసి పోలీసులు బూటకపు లొంగుబాటు డ్రామాలు ఆడుతున్నారని మానవ హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఓటరు ఐడి కార్డులు, ఇతర గుర్తింపు కార్డులున్న గ్రామస్థులను పోలీసులు నక్సల్స్ పేరుతో అరెస్టు చేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని లొంగుబాట్ల తర్వాత నక్సల్స్ వద్ద కూడా ప్రభుత్వం సర్టిఫై చేసిన ఐడి కార్డులున్నట్లు తాము గ్రహించామని, ఈ కార్డులతో మావోయిస్టులు పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా దాస్ చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్ ప్రతి ఒక్కరికీ పది వేల రూపాయల తాత్కాలిక సహాయం అందజేయడం జరుగుతుందని, లొంగుబాటు, పునరావాస పథకం కింద లభించిన అన్ని సదుపాయాలను వారికి కల్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.