జాతీయ వార్తలు

ఇషత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను ఎందుకు మార్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో అఫిడవిట్‌ను ఎందుకు ఎందుకు మార్చారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నిచారు. వెంకయ్యనాయుడు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఇషత్ జహాన్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని ఐబి రిపోర్టును, అఫిడవిట్‌ను మార్పించారని, హోంశాఖ కార్యదర్శి జికె పిళ్లై కూడా అఫిడవిట్ మార్చింది వాస్తవమని తెలిపారన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని వెంకయ్య ప్రశ్నించారు. దేశాభివృద్ధి లక్ష్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌నుప్రవేశపెట్టారని ఆయన అన్నారు. తన పట్టణాభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన వెంకయ్య,గ్రామం, రైతు,పేదవాడు,మహిళ,యువతకు నిధులు, వారి సంక్షేమానికి జైట్లీ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సమర్పించిన కాంగ్రెస్ పార్టీ అంకెలగారడీ బడ్జెట్ ఇది కాదన్నారు. కేంద్రం 14వ ఆర్థిక సంఘాం నివేదిక అధారంగానే అత్యధికంగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ కేటాయింపుల అంశంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వెంకయ్య నిరాకరించారు.