జాతీయ వార్తలు

ప్రభుత్వం ఎత్తుకు చిత్తయిన ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఇచ్చిన సభా హక్కుల తీర్మానాన్ని అడ్డం పట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడంలో కాంగ్రెస్ నాయకత్వంలోని మిత్రపక్షాలు విఫలం కాగా మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీక్ చిదంబరంపై 193 నోటీసు కింద చర్చ జరిపి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టటంలో అధికార బిజెపి విజయం సాధించింది. కాంగ్రెస్, వామపక్షాలు,తృణమూల్ కాంగ్రెస్‌లు బుధవారం లోక్‌సభలో స్మృతి ఇరానీపై ఇచ్చిన సభా హక్కుల తీర్మానంపై చర్చ జరిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్తంభింపజేయటం ద్వారా తీర్మానంపై చర్చ జరిపేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాన్ని బిజెపి విఫలం చేసింది. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాల సభ్యులు పోడియం వద్ద నిలబడి తనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినా స్పీకర్ ఎంత మాత్రం ఖాతరు చేయకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని గందరగోళం మధ్యనే పూర్తి కాలం అంటే నిర్వహించారు. జీరో అవర్‌లో ఈ అంశంపై ఆమె కాంగ్రెస్ పక్షానికి చీవాట్లు పెట్టి మీరు నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్షానికి చెందిన రంజితా రంజన్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌగత్‌రాయ్, వామపక్షానికి చెందిన సలీంలకు స్మృతి ఇరానీపై ఇచ్చిన సభా హక్కుల తీర్మానంపై ఒక్కొక్క నిమిషం పాటు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. దీనితో తాము అధికార పార్టీని దెబ్బ తీయగలిగామని ప్రతిపక్షం భావించింది. అయితే ఇది జరిగిన అనంతరం సుమిత్రా మహాజన్ అన్నా డిఎంకె ఇచ్చిన 193 నోటీసు ప్రకారం చిదంబరం, ఆయన కుమారుడు కార్తీక్‌కు సంబంధం ఉన్న ఏయిల్‌సెల్‌మాక్సిస్ సంస్థకు సంబంధించిన అవినీతి అంశాన్ని చర్చకు చేపట్టటంతో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కంగుతిన్నాయి. ఎయిల్‌సెల్ మాక్సిక్‌పై చర్చ జరగకుండా చూసేందుకు కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఆ పార్టీల సభ్యులంతా పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌగత్‌రాయ్ మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్లను సుమిత్రా మహాజన్ తోసిపుచ్చి 193 నోటీసుపై చర్చ ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ తదితర మిత్ర పక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. దీంతో కార్తీక్ చిదంబరం అవినీతి అంశంపై సుదీర్ఘ చర్చ జరిపించుకోవటం ప్రభుత్వానికి మరింత సులభం అయ్యింది. పలువురు సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. తెలుగుదేశం సభ్యుడు రవీంద్రబాబు, టిఆర్‌ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి, వైకాపాపక్షం నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా చర్చలో పాల్గొన్నారు
ఎవ్వరినీ వదలిపెట్టం
కుంభకోణాలకు బాధ్యులైన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చకు సమాధానం ఇస్తూ స్పష్టం చేశారు. ఏయిర్‌సెల్ మ్యాక్సిస్‌కు సంబంధించి ఇడి జరిపిన దాడుల్లో పలు కీలక పత్రాలు లభించాయని వెల్లడించారు. తప్పు చేసినట్లు రుజువైతే ఎంతటి పెద్ద వారైనా వదిలిపెట్టమని ఆయన సభకు భరోసా ఇచ్చారు.