జాతీయ వార్తలు

ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర విద్యుత్, బొగ్గు, పునరుత్పత్తి ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఉండేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేయడంతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. చంద్రబాబు విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరారని, అయితే దేశమంతా ఒకే విద్యుత్ విధానం అమలుకు చర్యలు మొదలు పెట్టామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఅర్ మా మంత్రిత్వశాఖ పని తీరును ప్రశంసించారని గుర్తుచేశారు. గతం లో విద్యుత్‌పై రాష్ట్రాల నుండి ఫిర్యాదులు వచ్చేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.