జాతీయ వార్తలు

‘ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన మూలంగా ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి రక్షించాలని అనకాపల్లి లోకసభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. ఆయన బుధవారం లోకసభ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు వీలున్నంత త్వరగా ప్రత్యేక హోదా ఇస్తే విభజన గాయాల నుండి కొంతైనా ఉపశమనం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రతిపాదనకు బిజెపితో సహా అన్ని పార్టీలు అంగీకరించాయని ఆయన తెలిపారు. సీమాంధ్రకు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బిజెపి ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మూలంగా సీమాంధ్ర ఆర్థికంగా ఎంతో నష్టపోయింది, ఐ.టి పరిశ్రమ లేకుండా పోయింది, వౌళిక సదుపాయాలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవన్నారు. అన్ని విద్యా సంస్థలు తెలంగాణాలో ఉండిపోయాయి, వౌళిక సదుపాయాలు కూడా తెలంగాణాలో ఉన్నాయన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు, కొత్త రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయి నుండి నిర్మించవలసి ఉన్నదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇది సాధ్యం కాదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. రాయలసీమతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.