జాతీయ వార్తలు

నడిసంద్రం.. చెన్నై నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 2: కొద్ది రోజులుగా కనీవినీ ఎరుగని రీతిలో ఎడతెరిపి లేకుండాకురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై మహానగరం అంతా వరద నీటిలో మునిగిపోయి ద్వీపకల్పాన్ని తలపిస్తుండగా, చుట్టుపక్కల తీరప్రాంత జిల్లాలు సైతం వరుణుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి. రైలు, రోడ్డు సదుపాయాలతో పాటుగా విమాన సర్వీసులు సైతం నిలిచిపోవడంతో చెన్నై నగరానికి బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు మొబైల్ ఫోన్లు, లాండ్‌లైన్లు సైతం పని చేయకపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. అడయార్ నదితో పాటుగా నగరం చుట్టూ ఉన్న పూండి, రెడ్‌హిల్స్ లాంటి రిజర్వాయర్లన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున వరద నీరు అనేక కాలనీలను ముంచెత్తింది. ఫలితంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో కాలనీలు మునిగి పోయాయి. అడయార్ నదికి ఆనుకుని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలలో రెండో అంతస్తుదాకా వరద నీరు పెరిగి పోవడంతో కాలనీలో జనం ఇళ్ల పైకప్పులపైకి చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు పెడుతున్నారు.
వందేళ్లలో లేనంత వర్షం
మంగళవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు చెన్నై నగరంతో పాటుగా చెంబరబాక్కం రిజర్వాయర్ ప్రాంతంలో వందేళ్లలలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదయింది. చెన్నైలో గత 24 గంటల్లో 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అడయార్ నది పరీవాహక ప్రాంతమైన చెంబరబాక్కంలో 47 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా అడయార్ నదిలోకి భారీ మొత్తంలో 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టడంతో ఆ నీరంతా నగరంతో పాటు శివారు ప్రాంతాలను ముంచెత్తడంతో వేలాది మంది నిర్వాసితులుగా మారారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య 197కు చేరుకుందని అధికారులు చెప్పారు.
మంగళవారం రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఫోన్‌లో మాట్లాడి కేంద్రంనుంచి అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడితో సమావేశమై పరిస్థితిని చర్చించారు. కేబినె