జాతీయ వార్తలు

మాట నిలబెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధానికి సంబంధించి ఇచ్చిన హామీలన్నింటినీ పాకిస్తాన్ నెరవేర్చాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం గురువారంనాడు విస్పష్టంగా ప్రకటించింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టడానికి తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వమంటూ అనేక సందర్భాల్లో పాక్ హామీ ఇచ్చిందని, కాని ఏకోశానా వాటిని నెరవేర్చలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పొరుగున వున్న పాక్‌తో సాధారణ సంబంధాలను పునరుద్ధరించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. పఠాన్‌కోట్‌పై జరిగిన దాడి అనంతరం ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన హామీలను పాక్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఈ దాడికి బాధ్యులైన వ్యక్తులను, సంస్థలను చట్టప్రకారం శిక్షించాలని కోరినట్లుగా తెలిపారు. పాకిస్తాన్‌తో ఉన్న సమస్యలన్నింటినీ శాంతియుత చర్చలద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అయితే దీనికి ముందు భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి పాక్ అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.
పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు ఆగిపోయాయి. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థే పఠాన్‌కోట్‌పై దాడికి కుట్ర పన్నిందని అప్పట్లోనే భారత్ స్పష్టం చేసింది. అంతేకాదు, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజాద్ ఆ దాడికి కుట్ర పన్నినట్లుగా వెల్లడించింది.