జాతీయ వార్తలు

లౌకికవాదం భారత జీవనాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లౌకికవాదం విషయంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడంలో అన్ని పార్టీలూ కలిసిరావాలని గురువారం సావధాన తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానంగా రాజ్‌నాథ్ తెలిపారు. కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగానికి, పదవీ ప్రమాణానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారన్న దానిపై సభ్యులిచ్చిన సావధాన తీర్మానానికి హోంమంత్రి స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన లౌకిక భావాలు గల దేశంగా భారత్‌ను అభినందించారు. దేశంలోని ప్రతి పౌరుణ్ణి జాతీయ వాదిగానే తాము భావిస్తామని, ఉగ్రవాదానికి మతం, కులం, రంగు అనేది లేదని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా పేర్కొన్న రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలోనూ ఈ అంశంపై మాట్లాడారు. దేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడం అన్నది ఏ ఒక్క పార్టీవల్లా సాధ్యమయ్యేది కాదని, అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి రామ్ శంకర్ కతేరియాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను రాజ్‌నాథ్‌సింగ్ సమర్థించారు. కతేరియా మాట్లాడిన వీడియోను తాను చూశానని, ఆయన మాటల్లో రెచ్చగొట్టే ధోరణి ఎక్కడా లేదని తెలిపారు. తాను వినడమే కాకుండా, ఇతరులకూ ఆయన ప్రసంగాన్ని వినిపించానని, ప్రతి ఒక్కరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ప్రత్యేకత భారతదేశంలో ఉన్నదని, భిన్నమతాలకు చెందినప్పటికీ ప్రజలందరూ సమైక్యతతో జీవిస్తున్న ఏకైక దేశం భారత్ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. రాజకీయ లాభనష్టాల ప్రాతిపదికగా మత సామరస్యాన్ని అంచనా వేయలేమని, న్యాయం మానవీయత కోణంలోనే దీన్ని పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు.