జాతీయ వార్తలు

మనోజ్‌కు ఫాల్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కప్‌డా ఔర్ మకాన్, క్రాంతి వంటి దేశభక్తి ఇతివృత్తంతో కూడిన ఎన్నో చిత్రాలను నిర్మించి, నటించి మిస్టర్ భరత్‌గా ఖ్యాతిగాంచిన ఒకప్పటి బాలీవుడ్ అగ్రనటుడు మనోజ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక దాదాఫాల్కే అవార్డు లభించింది. భారతీయ సినిమాకు చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా ఈ సమున్నత అవార్డుకు ఆయన్ని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. ఫాల్కే అవార్డుకు ఎంపికైన 47వ వ్యక్తి 78ఏళ్ల మనోజ్ కుమార్. అవార్డులో భాగంగా పదిలక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందిస్తారు. ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్, ఆశాభోస్లే, సలీం ఖాన్, నితిన్ ముఖేష్, అనూప్ జలోటాలతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఫాల్కే అవార్డుకు మనోజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. దేశ భక్తి చిత్రాలతోపాటు ఇటు పాటల పరంగా అటు కథాపరంగా విశేష ఆదరణ పొందిన హరియాలీ ఔర్ రాస్తా, దోబదన్, హిమాలయ్‌కి గోద్‌మే, ఓ కౌన్ థీ ఎన్నో చిత్రాల్లో అగ్ర హీరోగా మనోజ్ రాణించారు. దేశ విభజనకు ముందు నేటి పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో జన్మించిన మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. మనోజ్‌కు పదేళ్ల వయసులోనే ఆయన కుటుంబీకులు ఢిల్లీ వచ్చేశారు. హిందూ కాలేజీలో పట్టాతీసుకున్న ఆయన సినిమా జీవితానే్న తన కెరీర్‌గా ఎంచుకున్నారు. అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చినా హరియాలీ ఔర్ రాస్తాతో హీరోగా గుర్తింపు పొందారు. తర్వాత హనీమూన్, అప్‌నాబన్‌కే దేఖో, నక్లీ నవాబ్, దోబన్ వంటి చిత్రాల్లో నటుడిగా నిలదొక్కుకున్నారు.్భగత్ సింగ్ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన షహీద్ చిత్రం విజయవంతం కావడంతో ఆ కోవలోనే అనేక చిత్రాలను స్వయంగా నిర్మించారు. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ నినాదమైన జై జవాన్ జై కిసాన్ ఆధారంగా నిర్మించిన ఉప్‌కార్ చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. మైదాన్ ఎ జంగ్ చిత్రం తర్వాత 1995లో సినీ జీవితానికి స్వస్తి పలికిన మనోజ్ కుమార్ జైహింద్ అనే చిత్రం ద్వారా తన కుమారుడు కునాల్ గోస్వామిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఉప్‌కార్ చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు మనోజ్ కుమార్‌ను పద్మశ్రీతో ఇప్పటికే భారత ప్రభుత్వం సత్కరించింది.