జాతీయ వార్తలు

2018కి ముందే అన్ని గ్రామాలకూ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర: ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించిన 2018 గడువుకు ఏడాది ముందే దేశంలోని అన్ని గ్రామాలను విద్యుదీకరించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇక్కడ చెప్పారు. దేశంలో విద్యుత్‌కు, బొగ్గుకు కొరత లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘బొగ్గు కొరత కారణంగా దేశంలోని ఏ విద్యుత్ కేంద్రాన్ని కూడా తాత్కాలికంగా మూసివేయాల్సిన అవసరం రాలేదు. అంటే బొగ్గు కొరత లేదనే అర్థం. ఏ రాష్ట్రం ఎంత విద్యుత్ కోరినా మేము సరఫరా చేయగలం’ అని శనివారం సాయంత్రం ఇక్కడ భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) సమావేశంలో మాట్లాడుతూ గోయల్ చెప్పారు. 2018 నాటికల్లా అన్ని గ్రామాలను విద్యుదీకరించాలన్న నరేంద్ర మోదీ ప్రతిన గురించి ప్రస్తావిస్తూ, ‘గడువుకు కనీసం ఏడాది ముందే దీన్ని నెరవేర్చాలని మేము నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు. ఇప్పటివరకు 6,114 గ్రామాలను విద్యుదీకరించామని, అంటే 38 శాతం పని పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఎల్‌ఇడి బల్బులను మరింత ఎక్కువగా ఉపయోగించాలని ఆయన కోరుతూ, గతంలో ఈ బల్బు ధర రూ.450 ఉండేదని, బిడ్డింగ్‌లాంటి వాటిలో పారదర్శకత ఉండేలా చూడడం ద్వారా ఇప్పుడు రూ.74కే లభిస్తోందని చెప్పారు. 77 కోట్ల బల్బులను విక్రయించడం ద్వారా 2019 నాటికల్లా ప్రతి ఇంట్లోను ఎల్‌ఇడి బల్బులు ఉండేలా చూడాలన్నదే తమ లక్ష్యమని గోయల్ చెప్పారు. దీనివల్ల 2.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. గ్రామీణ ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆయన బిజెవైఎం కార్యకర్తలను కోరారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవడేకర్, కల్‌రాజ్ మిశ్రా, స్మృతి ఇరానీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.