జాతీయ వార్తలు

విచ్ఛిన్నకర శక్తులపై సానుభూతి చూపిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బృందావన్: దేశంలో చెలరేగుతున్న విచ్ఛిన్నకర శక్తులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సానుభూతి చూపించడాన్ని బిజెపి సీనియర్ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తూర్పారబట్టారు. భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన కార్యకర్తలనుద్దేశించి అరుణ్ జైట్లీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఏ నాయకుడూ చేయని పనిని రాహుల్ చేస్తున్నారని, సైద్ధాంతిక శూన్యతలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు. ఇందిర, రాజీవ్‌లు సైతం విచ్ఛిన్నకర శక్తులతో ఏనాడూ రాజీ పడలేదని, కానీ రాహుల్‌గాంధీ మాత్రం ఆ శక్తులకు వంతపాడుతున్నారని జైట్లీ ఆరోపించారు. దేశద్రోహ నేరంపై జైలుకెళ్ళి బెయిల్‌పై విడుదలైన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్‌పైనా జైట్లీ విమర్శలు గుప్పించారు. జాతి వ్యతిరేక నినాదాలు చేసి జైలు కెళ్లిన కన్హయ్య, బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు జైహింద్ నినాదాల మధ్య ప్రసంగించేందుకు వచ్చారని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు. స్వల్ప సంఖ్యలో ఉగ్రవాద ముఠాలు, పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టుల చర్యలపై రాహుల్‌గాంధీ సానుభూతి చూపించడం దేశానికి పట్టిన దురదృష్టమని జైట్లీ వ్యాఖ్యానించారు. జాతీయవాద శక్తులకు, జాతి వ్యతిరేక శక్తులకు గత వందేళ్లుగా జరిగిన పోరాటంలో కాంగ్రెస్ ఏనాడూ రాజీ పడలేదన్నారు. ‘దేశంలో కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. కొందరు యాకూబ్ మెమన్‌కు, మరికొందరు అఫ్జల్‌గురుకు స్మారక సభలు నిర్వహిస్తారు. దేశంలో కొద్ది సంఖ్యలో ఉన్న జిహాదీలను, పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులను సంతృప్తిపరచేందుకు చేసే చర్యలే’నని జైట్లీ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారిపై రాహుల్‌గాంధీ సానుభూతి చూపడం దురదృష్టకరమని తెలిపారు. మహాత్మాగాంధీకానీ, అంబేద్కర్ కానీ, ఇందిర, రాజీవ్‌లు కానీ ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదనీ, రాహుల్ సైద్ధాంతిక శూన్యతలో ఉన్నారనేందుకు ఇటీవలి పరిణామాలే నిదర్శనమని జైట్లీ అన్నారు. జాతీయ బాధ్యతను నెరవేర్చడంలో బిజెపి విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు.
కాగా, జెఎన్‌యు వివాదంపై ప్రభుత్వంపైనా, పార్టీపైనా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న బిజెవైఎం సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సదస్సుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జాతీయ వాదాన్ని పెంపొందించాలని యువ కార్యకర్తలకు పిలుపునిచ్చిన నాయకులు, ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌పైనా, ముఖ్యంగా రాహుల్‌పైనా ఎదురుదాడి చేయాలని సూచించారు.
chitram...
బృందావనంలో బిజెవైఎం సదస్సు సందర్భంగా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. చిత్రంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి ఎంపీ హేమమాలిని, బిజెవైఎం అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తదితరులు