జాతీయ వార్తలు

పేదలు, బలహీనులను అణచేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కావాలని డిమాండ్ చేస్తున్న పేదలు, బలహీనవర్గాలను మోదీ ప్రభుత్వం అణచివేస్తున్నదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పేదలు, బలహీనవర్గాల తరపున నిలబడిన తనపై కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పేదలు, బలహీనవర్గాలను అణచివేయడాన్ని అడ్డుకుంటామని, ఆయా వర్గాలకు తాను అండగా ఉంటానని రాహుల్ గాంధీ అన్నారు. ‘బస్తర్ నుంచి వచ్చిన గిరిజనులు ఈ రోజు నన్ను కలిశారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో వారు అత్యాచారాలకు గురవుతున్నట్లు నాకు చెప్పారు. వారిని అణచివేస్తున్నారు’ అని రాహుల్ సోమవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ‘మీరు భౌతికదాడులకు పాల్పడటం వల్ల, బెదిరించడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం కలుగదు. మీరు హైదరాబాద్‌లో రోహిత్ వేములను తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఇక్కడ (్ఢల్లీలో) మీరు కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎక్కడయినా పేదలు.. వారు రైతులయినా, దళితులయినా, గిరిజనులయినా, చిన్న వ్యాపారులయినా హక్కులకోసం పోరాడుతుంటే వారు నా దగ్గరికే వస్తున్నారని ఆయన అన్నారు. ఎక్కడ బలహీనులు గొంతు ఎత్తినా మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం వారిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు. ఈ ప్రజలే భారత దేశ బలమని, వీరిని అణచివేయడం ద్వారా ఎవరూ బాగుపడరని అన్నారు. ఎవరయినా చట్టాన్ని ఉల్లంఘిస్తే మీరు చర్య తీసుకోండి, కాని పేదలను కొట్టడం, బెదిరించడం, అణచివేయడం దేశానికి ఏమాత్రం ఉపయోగపడదు అని రాహుల్ గాంధీ హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అతని కేబినెట్ సహచరులు ప్రతిరోజూ తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘మీరు నాపై ఎంత కావాలనుకుంటే అంతగా వ్యక్తిగత దాడులకు దిగండి. కాని, పేదలు, బలహీనవర్గాల వారిని అణచివేయకండి’ అని మోదీ, అతని కేబినెట్ సహచరులను ఉద్దేశించి రాహుల్ అన్నారు.
chitram...
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుంచి వచ్చిన గిరిజనులతో మాట్లాడుతున్న రాహుల్