జాతీయ వార్తలు

భార్యపై కోపంతో విమానాన్ని కూల్చేస్తానన్న పైలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్: భార్యపై కోపంతో విమానాన్ని కూల్చేసి, అందులోని ప్రయాణికులందరినీ చంపడంతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఇటలీకి చెందిన ఒక పైలెట్ బెదిరించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 200 మంది ప్రయాణికులతో గత ఏడాది జనవరిలో రోమ్ నుంచి జపాన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన సదరు విమాన పైలెట్‌ను వదిలి వెళ్లిపోతానని భార్య హెచ్చరించడంతో అతను ఈ బెదిరింపునకు దిగాడని టైమ్స్ వార్తా పత్రిక వెల్లడించింది. తనను వదిలి వెళ్తే మార్గం మధ్యలో విమానాన్ని కూల్చేసి ప్రయాణికులందరినీ చంపడంతో పాటు తానూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ అతను భార్యకు టెక్స్ట్ మెసేజ్ పంపడంతో వెంటనే ఆమె ఈ విషయమై అధికారులను అప్రమత్తం చేసిందని, దీంతో రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయం నుంచి ఆ విమానం బయలుదేరడానికి ముందే పోలీసులు ఆ పైలెట్‌ను ఆపేసి మరో పైలెట్ ద్వారా ఆ విమానాన్ని పంపేశారని టైమ్స్ పేర్కొంది. 40వ పడిలో ఉన్న ఈ పైలెట్ నిత్యం తనను వేధిస్తున్నాడంటూ గతంలో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఆ తర్వాత ఆ పైలెట్‌ను సస్పెండ్‌చేసి మానసిక వైద్య పరీక్షలకు పంపారని తెలుస్తోంది. జర్మన్ పైలెట్ ఆండ్రెస్ లుబిట్జ్ జర్మన్‌వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన ఎ-320 విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆల్ఫ్స్ పర్వతాల్లో కూల్చివేసి 149 మందిని హతమార్చిన ఘటనకు రెండు నెలల ముందే ఈ సంఘటన జరిగింది.

మార్పుతోనే..పెట్టుబడులు!

లేకుంటే వెనకడుగే రాష్ట్రాలకు జైట్లీ హెచ్చరిక హర్యానాకు కితాబు

గుర్గావ్, మార్చి 7: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలూ తమనుతాము సంస్కరించుకోవాల్సి ఉంటుందని లేని పక్షంలో అన్ని విధాలుగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం రాష్ట్రాలను హెచ్చరించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పరస్పర పోటీ వాతావరణం ఉండాలన్నారు. పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూల వాతావరణాన్ని కల్పించే రాష్ట్రాలే ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంటుందని మిగతా రాష్ట్రాలది తిరోగమనమే అవుతుందని తెలిపారు.
మారక పోతే పతనమేనన్న వాస్తవం గతం కంటే కూడా ఇప్పుడు మరింత వాస్తవికంగా కనిపిస్తోందని హర్యానాలో గ్లోబల్ ఇనె్వస్టర్ల శిఖరాగ్ర సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆర్థిక మంత్రి అన్నారు.4ఇనె్వస్టర్లు దాతృత్వ స్వభావం కలిగిన వ్యక్తులు కాదు. లాభం ఉన్నచోటే పెట్టుబడులు పెడతారు. పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే అన్ని విధాలుగా ప్రోత్సాహక పరిస్థితులు ఉండాలి2అని జైట్లీ అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా విధానపరమైన అచేతనావస్థ ఉంటే..ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేయకపోతే అక్కడికి ఇనె్వస్టర్లు వెళ్లే అవకాశమే ఉండదన్నారు. అయితే ఇటీవలి కాలంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం గతంలో కంటే చాలా ఎక్కువగానే ఉందని అన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థతో పాటు దేశంలో పోటీ సమాఖ్య వ్యవస్థ కూడా చాలాబలంగా పాదుగొనాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా హర్యానా సాధించిన విజయాలను, సంస్కరణల పథంలో ముందుకు దూసుకుపోయిన తీరును జైట్లీ వివరించారు.
బలమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన హర్యానా ఇటీవలి కాలంలో ఎంతగానో పురోగమించిందని, తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుందని తెలిపారు. అలాగే అత్యంత కీలకమైన సేవారంగంగా కూడా హర్యానా రూపుదిద్దుకుంటోందని, ఢిల్లీ శివార్లలో ఆటోహబ్ రావడం అనేక విధాలుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిందన్నారు. భారీ ట్రాఫిక్ కారణంగా ఈ కార్యక్రమానికి తాను 20నిముషాల ఆలస్యంగా రావడాన్ని ప్రస్తావించిన జైట్లీ 3జాతీయ హైవేలో ట్రాఫిక్ సమస్యను తొలగించే చర్యలు చేపట్టక పోతే ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది2అని తెలిపారు. ఢిల్లీని హర్యానాలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయడం అత్యవసరమన్నారు.

సోమవారం గుర్‌గావ్‌లో జరిగిన గ్లోబల్ ఇనె్వస్టర్ల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్