జాతీయ వార్తలు

మహిళలకు స్వేచ్ఛ.. సమాజానికే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహిళలు మానసికంగా బలంగా తయారుకావాలని, ఇళ్లల్లో, పనిచేసేచోట తమ ఇష్టాలను స్వేచ్ఛగా అమలుచేసే పరిస్థితులను సృష్టించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మహిళా సాధికారికతకోసం అరుదైన సేవలందించిన 15 మంది మహిళలకు, ఏడు సంస్థలకు ‘నారీ శక్తి అవార్డు’లను రాష్టప్రతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల పట్ల జనం మనస్తత్వం మారాలని, మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం సమాజానికే మేలనే విషయాన్ని వారు గ్రహించాలని అన్నారు. అవార్డులు అందుకున్న ఏడు సంస్థల్లో హర్యానా రాష్ట్రం కూడా ఉంది. ఆడపిల్లల నిష్పత్తి పెరగడానికి కృషి చేసినందుకుగాను ఆ రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. ‘మహిళలు ఏదయినా పని చేయడానికి అవకాశం, అనుమతి ఇవ్వడం లేదనే మాట నేను తరచుగా వింటున్నాను. మీ హక్కును మీకు ఎవరో ఇచ్చే దాకా ఎందుకు వేచి ఉండాలి. మహిళలు మానసికంగా శక్తివంతులు కావాలి. ఎలాంటి ఆంక్షలు, భయం లేకుండా ఇళ్లల్లో, పని చేసేచోట స్వేచ్ఛగా తమకిష్టమైన పనిచేసే పరిస్థితులను కల్పించడం సమాజానికే మంచిదనే విషయాన్ని జనం అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
అవార్డులు అందుకున్నవారిలో జర్నలిస్టు, పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త, న్యాయవాది, మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలాంటి వారు ఉన్నారు. వీరిని సెలెక్ట్ కమిటీ ఎంపిక చేసింది. అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తి అని, వీరిని చూసి భారతదేశం గర్విస్తుందని, ఈ మహిళలంతా ప్రపంచంలో తాము కోరుకున్న మార్పును తీసుకురావడంకోసం లెక్కలేనన్ని అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొన్న వారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చెప్పారు.
అవార్డు అందుకున్న 15 మంది మహిళల్లో మహారాష్టక్రు చెందిన సిస్టర్ లూసీ కురియన్, ప్రీతీ పాట్కర్, శకుంతలా మజుందార్, జ్యోతి మాప్‌సేకర్, ఢిల్లీకి చెందిన వాసు ప్రిమ్లాని, సుమితా ఘోస్, అంజలీ శర్మ, కృష్ణయాదవ్, సౌరబ్ సుమన్ (బీహార్), బసంతీ దేవి (ఉత్తరాఖండ్), సుపర్ణా బక్షీ గంగూలి (కర్నాటక), మీనా శర్మ (రాజస్థాన్), ఉత్తరా పర్వార్ (మధ్యప్రదేశ్), పోలుమతి విజయనిర్మల (ఆంధ్రప్రదేశ్), సుజాతా సాహు (హర్యానా) ఉన్నారు. అవార్డులు పొందిన సంస్థల్లో అంగడిపురం గ్రామ పంచాయతీ (కేరళ), హర్యానా రాష్ట్రం, గురియ స్వయం సేవి (యుపి), జాగోరి (్ఢల్లీ), కోనొక్లోటా మహిళా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ (అసోం), కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్, అసెస్‌మెంట్ కౌన్సిల్, బ్రేక్‌త్రూ ట్రస్టు (్ఢల్లీ) ఉన్నాయి.
chitram...
నారీ శక్తి అవార్డు గ్రహీతలతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ