జాతీయ వార్తలు

హోదాపై హోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపితోపాటు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. సభ నుంచి సస్పెండ్ చేస్తానని ఉపాధ్యక్షుడు కురియన్ పలుమార్లు హెచ్చరించినా కాంగ్రెస్ సభ్యులు వెనకడుగు వేయకుండా ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టారు. వారంతా పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ ఒకసారి వాయిదా పడింది. లోక్‌సభలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేనందున తామేమీ చేయలేకపోతున్నామంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన చాలా హామీలను కేంద్రం అమలుచేసిందని రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడ లేదు.
మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ జీరో అవర్‌లో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వావలసిన అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవడం వల్ల ఏపి ఆర్థికంగా ఎంతో నష్టపోయిందన్నారు. విభజన బిల్లును రాజ్యసభలో ఆమోదించే సమయంలో ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారని, అలాగే విభజన చట్టంలో ఏపికి పలు హామీలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కల్పించాలని తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తే వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారని ఆజాద్ గుర్తుచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో కేంద్ర మంత్రివర్గం కూడా నిర్ణయించిందని స్పష్టం చేశారు. పదేళ్లు హోదా కల్పించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేసినప్పుడు అరుణ్ జైట్లీ సభలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘ఆంధ్రకు రాజధాని లేదు. ఆర్థిక వనరులు లేకుండాపోయాయి. ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇంతవరకు ఇవ్వలేదు’ అని కెవిపి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని సభలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయరా? అని ఆయన నిలదీశారు. అదే సమయంలో జెడి శీలం, సుబ్బిరామిరెడ్డి, రేణుకాచౌదరి, ఖాన్, హనుమంతరావు లేచి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. కురియన్ దీనికి ఒప్పుకోకపోవటంతో వారు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు.
కాగా టిడిపి సభ్యుడు సిఎం రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా అంశంపై గొడవ చేస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరచకుండా ఇప్పుడిక్కడ గొడవ చేస్తే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో చేస్తోందని, ఇంకా చేస్తుందని రమేశ్ భరోసా ఇచ్చారు.
హామీలన్నీ అమలు చేస్తున్నాం: జైట్లీ
రాష్ట్ర విభజన చట్టంలో చేసిన మెజారిటీ హామీలను పూర్తి చేశామని జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు బదులిస్తూ ‘రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు నిధులు ఇచ్చాం. ఇక మీదట కూడా ఇస్తాం’ అని స్పష్టం చేశారు. ఏపిలో పలు సంస్థలను ఏర్పాటు చేశామని, మరికొన్ని ఏర్పాటవుతున్నాయని, రెండు రకాల పన్ను రాయితీలు కూడా ప్రకటించామని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి గత ఏడాది కొన్ని నిధులు ఇచ్చామని, పోలవరానికి నిధులు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. అయితే జైట్లీ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ ఎంపీలు మరోసారి పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. దీంతో సభ వాయిదా పడింది.
లోక్‌సభలో వాకౌట్
యుపిఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చనందునే తామేమీ చేయలేకపోతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో చెప్పారు. ప్రత్యేక హోదాపై సభలో జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ ఎపికి కేటాయించిన పథకాలు, ఇచ్చిన నిధులను చదివి వినిపించారు. హోదాపట్ల అంత ప్రేమ ఉంటే దానిని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని కాంగ్రెస్‌ను నిలదీశారు. మొదట కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ప్రస్తావించారు. పథకాలు, వాటికి కేటాయించిన నిధుల గురించి వివరించే బదులు ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా నిలదీశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవటంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

తెలంగాణకు అన్యాయం
కేంద్రంపై తెరాస ఎంపీ
జితేందర్‌రెడ్డి ధ్వజం
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 15: తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయటంలో ఎన్‌డిఏ ప్రభుత్వం విఫలమైందని టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్‌రెడ్డి విమర్శించారు. జితేందర్ రెడ్డి మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ తెలంగాణకు ఎన్ని పథకాలు ఇచ్చారో చెప్పాలని ఆయన మంత్రి వెంకయ్య నాయుడును ప్రశ్నించారు.
వీలైనంత త్వరగా హైకోర్టు: రాజ్‌నాథ్
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే అంశం కేంద్ర న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ జీరో అవర్‌లో తెలిపారు. వీలున్నంత త్వరగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆదాయం ఇక్కడ.. వ్యయం అక్కడ!

ఉస్మానియాలో విషాదఛాయలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య విద్యార్థుల మృతి పట్ల నగరంలోని ఓయు మెడికల్ కళాశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట విద్యార్థుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. దీంతో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి విజయవాడ సమీపంలోని సూరాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్యవిద్యార్థులతోపాటు, బస్సు డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతులు విజయ్ తేజ, ప్రణవ రాజారాం హౌస్ సర్జన్లు కాగా మెడికోలు గిరి లక్ష్మణ్, మోహన్‌కృష్ణ ఉన్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో వైద్యుల సంఘం అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ ఆలిండియా ఇంటర్ మెడికల్ కాలేజి స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా వైద్య విద్యార్థులు అమలాపురం వెళ్లారని, ఆటల పోటీలు ముగియగా సోమవారం రాత్రి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. 250 మెడికల్ సీట్లుగల ఓయూ కళాశాలలో కేవలం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయని, అవి కూడా కాలం చెల్లిన బస్సులేనన్నారు. కళాశాలకు చెందిన బస్సులో కాకుండా ప్రైవేటు బస్సులో విద్యార్థులను తీసుకెళ్లారని, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్య విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా, క్షతగాత్రులకు ఇతరత్రా సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి నాయినిని ఆదేశించారు.

నేటినుంచే విమానాల పండగ!

ఐదు రోజులపాటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రదర్శన ప్రారంభించనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: అంగరంగ వైభవంగా ఐదు రోజుల విమానాల పండగ బుధవారం ఇక్కడ ప్రారంభమవుతోంది. దేశ విదేశాలకు చెందిన విమానాలతో హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఆకర్షణీయంగా నిలవనుంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ అంతర్జాతీయ విమానాల పండగను నిర్వహిస్తోంది. ‘్భరత విమానయాన రంగం-అంతర్జాతీయ మ్యానుఫాక్చరింగ్, ఎంఆర్‌ఒ హబ్‌కు అవకాశాలు’ అనే అంశంతో ఈ నెల 16 నుంచి 20వ, తేదీ వరకు బేగంపేట్ విమానాశ్రయంలో ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ సదస్సును, ప్రదర్శనను భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి లాంఛనంగా ప్రారంభిస్తారు. భారత పౌర విమానయాన, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (్ఫక్కి) సంయుక్త్ధ్వార్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో యుకెకు చెందిన మార్క్ జెఫ్రిస్, ఎరోబొటిక్స్ విమానాలు, నాలుగు 330 ఎస్‌సి ఎయిర్‌క్రాఫ్ట్స్, నాలుగు సింగిల్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఈ ప్రదర్శనలో ఆకర్షణగా నిలువనున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహన్, ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ సదస్సులో పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం గం. 300లకు ప్రారంభమయ్యే ఈ అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శనలో సుమారు 12 దేశాలకు చెందిన 200 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి సదస్సును ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ప్రసంగిస్తారు. ఫిక్కి ప్రెసిడెంట్ వందన సమర్పణ చేయగా, విమానాల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొదటి రెండ్రోజులు పరిశ్రమల అధిపతులు, విమానాల ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని, మరుసటి రోజు విఐపిల సమక్షంలో విమానాల విన్యాసాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. విమానాల పండగ చివరి రెండ్రోజులు సందర్శకులకు అనుమతిస్తారని, బేగంపేట విమానాశ్రయంలో బారికేడ్‌కు 30 అడుగుల దూరం నుంచి వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. యుకె, జర్మని, కెనడా, దుబాయి, సౌదీ అరేబియా వంటి దేశాలతోపాటు శ్రీలంక, మారిషస్, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఆబుదాబి, కువైట్ దేశాలకు చెందిన విమానాలు ఈ ప్రదర్శనలో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.