జాతీయ వార్తలు

వాదన వినిపించే హక్కు మాకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపుల వివాదం కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. బుధవారం సుప్రీం కోర్టులో న్యాయముర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్‌లతోకూడిన ధర్మాసనం బుధవారం కేసును విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటినే తెలంగాణ వాటా అడగాలన్న కేంద్రం వైఖరి సరికాదని కోర్టుకు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి పంపకాల్లో వివాదాలు ఏర్పడితే, ఏడాదిలోగా కేంద్రం పరిష్కరించకపోతే సమస్యను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. నీటి కేటాయింపులు జరిపే హక్కు పార్లమెంట్, సుప్రీం కోర్టు, కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల వివాదం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు గెజిట్‌లో సైతం ప్రచురితం కానందున తుది తీర్పు కాదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టికల్ 262 ప్రకారం తెలంగాణ తమ వాదనలు వినిపించే హక్కుందని ధర్మాసనానికి తెలిపారు. కేంద్రానికి దూరదృష్టి లేకపోవాడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు 5 గంటల సమయం పడుతుందని వైద్యనాథన్ చెప్పారు.