జాతీయ వార్తలు

ఉపశమనం కోసం ఆధ్యాత్మికత వైపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లోర్ (తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా ఇక్కడి కేంద్ర కారాగారంలో సుమారు 25 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్న శ్రీహరన్, శంతన్ లోతయిన ఆధ్యాత్మికపరులుగా మారిపోయారు. ఈ కేసులోని ఏడుగురు ఖైదీలలో వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతన్ ప్రతి రోజు జైలు ఆవరణలో గల దేవాలయాలను సందర్శించి, అమ్మన్ దేవతను, గణేశుడు, సాయిబాబాలను ప్రార్థిస్తుంటారని ఉన్నత స్థాయి జైలు వర్గాలు తెలిపాయి. ప్రత్యేక సందర్భాలలో వారు మతాచారాలు, సంప్రదాయాలను పాటిస్తుంటారని ఆ వర్గాలు వివరించాయి. అయితే ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ అరివు అలియాస్ పెరరివలన్ మాత్రం నాస్తికుడని జైలు వర్గాలు తెలిపాయి.
కాషాయం రంగు చొక్కా ధరించే శ్రీహరన్ ఆధ్యాత్మిక చింతనలో బాగా మునిగిపోయారు. తన సెల్‌లోనే క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుంటాడు. ఇదే కేసులో మహిళా జైలులో ఖైదీగా ఉన్న నళినికి శ్రీహరన్ భర్త. శ్రీహరన్ తన భార్య నళినికన్నా కూడా ఆధ్యాత్మిక చింతనను అవగాహన చేసుకోవడానికి ఆధ్యాత్మికవాదాన్ని అనుసరించడంపై చర్చలు జరుపుతుంటాడు. శ్రీహరన్ నెలలో ఒకటి లేదా రెండుసార్లు తన భార్యతో భేటీ అవడానికి జైలు అధికారులు అనుమతిస్తుంటారు. జైలులోని ఇతర ఖైదీల వలెనే రాజీవ్‌గాంధీ హత్య కేసులోని ఖైదీలయిన శ్రీహరన్ తదితరులు కూడా జైలులో పనిచేస్తుంటారు. వారు బట్టలు కుట్టడం వంటి పనుల్లో శిక్షణ పొందారని జైలు వర్గాలు తెలిపాయి. శ్రీహరన్, శంతన్‌లకు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు 2014లో యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించిన తరువాత వారు భగవంతుడి కృపవల్లే తమకు శిక్ష తగ్గిందని వ్యాఖ్యానించారు. నళిని మాత్రం విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు చదువుతుంటుందని జైలు వర్గాలు తెలిపాయి.

షెహనాయ్ విద్వాంసుడు
ఉస్తాద్ అలీ అహ్మద్ మృతి
కోల్‌కతా, మార్చి 16: ప్రముఖ షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ బుధవారం ఇక్కడ కన్నుమూశారు. 77ఏళ్ల ఖాన్ కిడ్నీ సంబంధిత సమస్యతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందరు. షెహనాయ్ వాయద్యంలో ప్రసిద్ధుడైన బిస్మిల్లాఖాన్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు హుస్సేన్ ఖాన్ సంపాదించుకున్నారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. బెనారస్ స్కూల్ ఆఫ్ షెహనాయ్ మ్యూజిక్ నుంచి వచ్చిన ఉస్తాద్ అలీ ఖాన్ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. హిందూస్తానీ వాయద్య విభాగంలో 2009లో ఆయనకు సంగీత నాటక అకాడెమీ అవార్డు లభించింది. హెహనాయ్ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన ఉస్తాద్ అలీ ఖాన్ క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద సంగీతంలోనూ గణతికెక్కారు. బెల్జియం, రష్యా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ట్యునీషియా, సింగపూర్, ఇండోనేసియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 1973లో దూరదర్శన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి షెహనాయ్ వినిపించారు. ఆకాశవాణిలో ఉన్నత శ్రేణి కళాకారునిగా చాలాకాలం కొనసాగారు. అలాగే ఐటిసి సంగీత్ రీసెర్చి అకాడెమీలో సంగీత పాఠాలు బోధించారు. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘బంగాభూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మమత శాస్ర్తియ సంగీత రంగానికి తీరని లోటని అన్నారు.

దేశద్రోహం
చట్టానికి పదును
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 16: దేశద్రోహం చట్టం పరిధి విస్తృతమైందని కేంద్రం స్పష్టం చేసింది. చట్టం మరింత సమర్థవంతంగా అమలుకు సంబంధించి లా కమిషన్ సమీక్షిస్తున్నట్టు తెలిపారు. దేశద్రోహం చట్టం అంశం బుధవారం రాజ్యసభలో చర్చకు వచ్చింది. లా కమిషన్ నివేదిక అందజేసిన తరువాత దానిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సభ్యులు సూచనకు కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగీకరించారు. జెఎన్‌యులో ఇటీవల తలెత్తిన వివాదం నేపథ్యంలో చట్టం దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. లా కమిషన్ నివేదికను సాధ్యమైనంత త్వరలోనే సభ ముందుంచుతామని ఆయన వెల్లడించారు. రాజకీయకక్ష సాధింపునకు చట్టాన్ని వాడుతున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలను హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఈ చట్టం కింద కేసులు నమోదైంది ఢిల్లీలో కాదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రాజీవ్‌గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లపై తెలంగాణలో కేసు నమోదైన విషయాన్ని మంత్రి స్పష్టం చేశారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2014లో దేశ వ్యాప్తంగా 47 దేశద్రోహం కేసులు నమోదైనట్టు రిజిజు తెలిపారు.
అత్యధికంగా బిహార్‌లో 16 కేసును నమోదయ్యాయన్నారు. తరువాత స్థానంలో జార్ఖండ్ ఉందని చెప్పారు. కేరళ, ఒడిశా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.