జాతీయ వార్తలు

19 మంది పాక్ అధికారులకు వీసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: టి-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను చూడడానికి కొంతమంది పాకిస్తానీ దౌత్య అధికారులకు భారత్ అనుమతి నిరాకరించడంపై మంగళవారం వివాదం చెలరేగిన తర్వాత కేంద్రం బుధవారం పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన 19 మంది అధికారులకు ప్రయాణ అనుమతులు మంజూరు చేశామని, మరిన్ని అభ్యర్థనలను పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ద్వారా కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. బుధవారం బంగ్లాదేశ్‌తో, ఈ నెల 19న భారత్‌తో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను చూడడానికి కోల్‌కతా వెళ్లడానికి ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని కొంతమంది దౌత్య అధికారులకు అనుమతి నిరాకరించడంపై పాకిస్తాన్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ జెపి సింగ్‌ను పాక్ విదేశాంగ కార్యాలయం పిలిపించి అభ్యంతరం తెలియజేసిన తర్వాత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయమై విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు వికాస్ స్వరూప్ సమాధానమిస్తూ ఇరు దేశాలు ఇప్పటివరకు పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం పాకిస్తాన్ ఈ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేయలేదని చెప్పారు.
అయితే, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని సుహృద్భావ సూచకంగా 19 అనుమతులు మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

మీది భావ స్వేచ్ఛ..
నాది అసహనమా?
రాజ్యసభలో ఏచూరిపై జైట్లీ విసుర్లు
న్యూఢిల్లీ, మార్చి 16: ‘మీరు నన్ను విమర్శిస్తే భావ ప్రకటన స్వేచ్ఛా? అదే నేను మిమ్మల్ని విమర్శిస్తే అసహనమా?’ బుధవారం రాజ్యసభలో ఆధార్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు జైట్లీ కొంతమంది మేధావులు అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేయడాన్ని ఉద్దేశపూర్వకంగా జరిపిన ‘పేపర్ తిరుగుబాటు’గా అభివర్ణించారు. ‘అవార్డులు తిరిగి ఇస్తున్నవారు ఇతర మార్గాల ద్వారా రాజకీయాలు ఆడుతున్నారు. వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై వారి ట్వీట్లు, వైఖరులను గమనించినట్లయితే, వారిలో చాలామంది కరుడుగట్టిన బిజెపి వ్యతిరేక శక్తులు మీకు కనిపిస్తారు’ అని ఫేస్‌బుక్‌లో ఉంచిన సందేశంలో జైట్లీ అన్నారు.

బిజెపిలో చేరిన
విజయ్ కుమార్
చెన్నై, మార్చి 16: తమిళం, తెలుగు సహా దక్షిణాది భాషల్లో 800కి పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు విజయ్ కుమార్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ తన ఉనికిని విస్తరించుకోవడానికి, అలాగే మరికొంతమంది కళాకారులు పార్టీలో చేరడానికి విజయ్ కుమార్ చేరిక తోడ్పడుతుందన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా పార్టీ వ్యక్తం చేసింది. కాగా, బిజెపి అధిష్ఠానవర్గం కోరినప్పుడు తాను ఎన్నికల ప్రచారం బరిలోకి దిగుతానని విజయ్‌కుమార్ చెప్పారు. దక్షిణాది భాషలన్నిటిలోను తాను నటించినందున తమిళనాడు సహా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోను తాను ప్రజలకు బాగా తెలుసునని కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ సమక్షంలో పార్టీలో చేరిన విజయ్‌కుమార్ విలేఖరులకు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రశంసించిన విజయ్‌కుమార్ ఈ పథకాలు అన్ని రాష్ట్రాలకు చేరాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, అయతే తమిళనాడులో బిజెపి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. విజయ్‌కుమార్‌ను పార్టీ నిండు హృదయంతో ఆహ్వానిస్తోందని రాధాకృష్ణన్ చెప్పారు. విజయ్‌కుమార్ బిజెపిలో చేరడం వల్ల దక్షిణాదిలో పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

మరింతమంది కళాకారులు బిజెపిలో చేరడానికి ఇది తోడ్పడుతుందని కూడా రాధాకృష్ణన్ చెప్పారు.