జాతీయ వార్తలు

పోరాడితేనే ‘హోదా’ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం భరోసా ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం ఏఐసిసి కార్యాలయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేసేందుకు ఢిల్లీకి వచ్చిన 300 మంది ఏపి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపిలో ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగా లేకపోవచ్చు కానీ మున్ముందు మళ్లీ అధికారంలోకి వస్తామని రాహుల్ అభిప్రాయపడ్డారు. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు సాయం చేయాల్సిన ప్రధాని ప్రజలకు మట్టి, చెంబుడు నీళ్లు బహూకరించారని ఆయన ఎద్దేవా చేశారు. తొలుత ప్రత్యేక హోదాకోసం ఢిల్లీ వచ్చి గుండెపోటుతో చనిపోయిన కార్యకర్త ఎల్ వెంకయ్య కుటుంబానికి సంతాపం తెలిపారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఏపికి ఇచ్చిన హామీల సాధనకు మొత్తం కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు తాను పలుమార్లు రాష్ట్రానికి వెళ్లానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని ఈ విషయంలో వైకాపా, టిడిపి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ‘మీరు రాష్ట్రం నుండి మట్టి, నీరు తెచ్చి నరేంద్ర మోదీకి సరైన సమాధానం చెప్పారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు నరేంద్ర మోదీపై పెద్ద ఎత్తున వత్తిడి తీసుకురావాలన్నారు. మోదీ ఒత్తిడికి మాత్రమే లొంగుతారన్న రాహుల్ ‘కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొచ్చినందుకే భూసేకరణ బిల్లును వెనక్కు తీసుకున్నారు. బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు’ అని వెల్లడించారు. ఏపిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగా లేకపోవచ్చు కానీ ముందు కష్టపడేకొద్దీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనికి పంజాబ్‌ను ఆయన ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంలోని బిజెపికి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. విభజన సందర్భంగా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాజధాని నిర్మాణానికి ప్రత్యేక సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే పోలవరానికి జాతీయ హోదా, లోటు భర్తీకి ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినట్టు ఆమె అన్నారు. అయితే కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ హామీలను మరిచిపోయారని సోనియా ధ్వజమెత్తారు. రైతుల అభీష్టానికి భిన్నంగా వారి భూములు తీసుకుంటున్నారని ఆమె విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు గట్టిగా కృషి చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు అందరం కలిసి కృషి చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అడిగిన వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వదు, దీనికోసం అంతా పోరాడాల్సింది ఉంటుంది అని అన్నారు.

ఢిల్లీలో బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదికపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్