జాతీయ వార్తలు

ఆస్తులు పంచుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆస్తులు, నిధులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఆస్తులను రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలనీ, అలా కుదరని పక్షంలో పంపకాల కార్యక్రమాన్ని రెండు నెలల్లో పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలని తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తమ తీర్పును ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ ప్రాంతానికే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనే నిజమైతే అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఆస్తులను 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలంటూ రాష్ట్ర విభజన చట్టంలో చేసిన నియమం దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఏపిఎస్‌సి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటం కూడా న్యాయబద్ధం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో సేకరించి ఈ ఖాతాలో జమ చేసిన నిధులను ఉపయోగించుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పదమూడు జిల్లాలకు సంబంధించిన నిధుల ఖాతాలను నిర్వహించేందుకు ఏపి ప్రభుత్వాన్ని అనుమతించాలని ధర్మాసనం తమ తీర్పులో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న రెండు నెలల్లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపిఎస్‌సి ఆస్తుల పంపకాన్ని కమిటీ ద్వారా పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు. ఏపిఎస్‌సి ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నందున వాటన్నింటిని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవటం సమర్థనీయం కాదని న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 75వ సెక్షన్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయనటం సముచితం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇదే నిజమైతే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులను పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సెక్షన్ 47 నిరుపయోగం, వ్యర్థం అవుతుందని ధర్మాసనం తమ తీర్పులో స్పష్టం చేసింది. అందుకే ఏపిఎస్‌సి ఆస్తులు, నిధులు తమకే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదన సరైంది కాదని తీర్పులో సూచించారు. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఆస్తులు, అప్పులను సమాన పద్దతిలో విభజించటం సహజమని ఇరువురు న్యాయమూర్తులు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయ నిపుణులు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితర అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించిన అనంతరం ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.