జాతీయ వార్తలు

పాక్ బృందం కోసం విధివిధానాలు: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడిపై దర్యాప్తు చేయడానికి వస్తున్న పాక్ సంయుక్త విచారణ బృదం పర్యటన నిమిత్తం కేంద్ర ప్రభు త్వం విధివిధానాలు రూ పొందిస్తోంది. కేంద్ర హోమ్ మం త్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పాక్ సంయుక్త విచారణ బృందం వస్తుందన్న విషయం మీడి యా ద్వారానే తెలుసుకున్నాం. విచారణకు సంబంధించి మేం పూర్తి సమాయత్తంగానే ఉన్నాం’అని ఆయన స్పష్టం చేశారు. పాక్ పర్యటనకు సంబంధించి విధి విధానాలు రూపొందిస్తామని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాక కోసం వేచి చూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన సుష్మ పొఖారాలో పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌తో భేటీ అయిన అనంతరం పాక్ దర్యాప్తు బృందం ఈనెల 27న భారత్ వస్తుందని వెల్లడించారు. అలాగే హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు గురువారం నాడొక ప్రకటనలో పాక్ సంయుక్త దర్యాప్తు బృందానికి సహకరిస్తామన్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడికి సంబంధించి వారికి అవసరమైన సమాచారం భారత్ అందిస్తుందని ఆయన చెప్పారు. జనవరి 2న జరిగిన ఉగ్రవాద దాడిలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఏడుగురు భద్రతాసిబ్బంది చనిపోయారు. దాడి సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఉగ్రవాదులందరూ మృతి చెందారు.

అదొక అనైతిక చర్య
స్వలింగ సంపర్కంపై సంఘ్ నేత
న్యూఢిల్లీ, మార్చి 18: స్వలింగ సంపర్కం అనేది నేరం కాదని, అదొక అనైతికత చర్య మాత్రమేనని ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హోసబ్లే వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కం అనేదాన్ని మానసికమైన కేసుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే గే వివాహాల నిషేధానికి డిమాండ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.‘స్వలింగ సంపర్కం నేరం కాదు. అయితే ఓ అనైతిక చర్య. దాన్నొక నేరంగా పరిగణించి ఎవర్నీ శిక్షించాల్సిన అవసరం లేదు..అలాంటి వాటిని మానసిక దౌర్భలత్వం కింద పరిగణించాలి’అని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడిన దత్తాత్రేయ హోసబ్లే స్వలింగ సంపర్కం నేరం కాదని అనేశారు. శుక్రవారం యూ టర్న్ తీసుకున్న ఆయన స్వలింగ సంపర్కం అనైతిక చర్యగా పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం గొప్ప పని అనడం తన ఉద్దేశం కాదని చెప్పారు. సెక్స్ అన్నది పూర్తిగా వ్యక్తిగతం అలాగే ప్రైవేటు వ్యవహారం అని ఆయన తెలిపారు.
ఉమర్, అనిర్బన్‌లకు
ఆరు నెలల బెయిలు
న్యూఢిల్లీ, మార్చి 18: దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. వీరిద్దరు శుక్రవారం ఆరు నెలల మధ్యంతర బెయిలు పొందారు. గత నెలలో జెఎన్‌యు క్యాంపస్‌లో దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి ఢిల్లీ కోర్టు ఈ మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. ఇవే అభియోగాలను ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఇదివరకే బెయిలు పొందిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై నమోదు చేసిన అభియోగాలనే ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ బెయిలు పొందాడని ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి రీతేశ్ సింగ్ వ్యాఖ్యానించారు. రూ. 25వేల స్వంత పూచీకత్తు, ఒకరి జమానతుపై వీరిని సెప్టెంబర్ 19వరకు విడుదల చేయాలని మధ్యంతర బెయిలు ఆదేశాలలో న్యాయమూర్తి ఆదేశించారు. జెఎన్‌యులోని సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్‌కు చెందిన అధ్యాపకులు సంగీతా దాస్ గుప్తా, రజత్ దత్తాలు వరుసగా అనిర్బన్, ఉమర్‌లకు జమానతు ఇచ్చారు. మధ్యంతర బెయిలు పొందిన కాలంలో తన అనుమతి లేకుండా ఢిల్లీ వదలిపోరాదని, దర్యాప్తు అధికారి పిలిచినపుడు హాజరు కావాలని న్యాయమూర్తి ఉమర్, అనిర్బన్‌లను ఆదేశించారు.

.

‘్భరత్ అమీ కీ జై’ అనడానికి సిద్ధమేనా?
అసదుద్దీన్‌ను నిలదీసిన షబానా ఒవైసీపై పోటీకి సై: జావెద్ అఖ్తర్
న్యూఢిల్లీ, మార్చి 18: ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ భర్త జావెద్ అఖ్తర్ అడుగుజాడల్లోనే శుక్రవారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై దాడికి దిగారు. మెడమీద కత్తి పెట్టినా ‘్భరత్ మాతా కీ జై’ అని నినదించే సమస్యే లేదని ఇటీవల అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె నిశితంగా విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ ‘ఒవైసీ సాబ్‌ను నేను ఒకటి అడగదలచుకున్నాను. ఆయనకు ‘మాతా’ అనే పదం గురించి అభ్యంతరం ఉంటే, ‘్భరత్’ అనే పదం గురించి ఎలాంటి అభ్యంతరం లేకుంటే, ‘్భరత్ మాతా’ బదులు ‘్భరత్ అమీ కీ జై’ అని అనడం ఆయనకు ఇష్టమేనా’ అని నిలదీశారు. జావెద్ అఖ్తర్ మంగళవారం ఇదే అంశంపై హైదరాబాద్ ఎంపీ అయిన ఒవైసీని పరోక్షంగా విమర్శించిన విషయం తెలిసిందే. ‘రాజ్యాంగంలో లేనందున ‘్భరత్ మాతా కీ జై’ అని నినదించను అని ఆయన (ఒవైసీ) చెప్పారు. రాజ్యాంగం షేర్వానీ ధరించాలని, టోపి పెట్టుకోవాలని కూడా ఆయనని కోరడం లేదు.. ‘్భరత్ మాతా కీ జై’ అనడం నా విధి అవునో కాదో నేను పట్టించుకోను. అది నా హక్కు’ అని జావెద్ అఖ్తర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో భార్య షబానాతో కలిసి పాల్గొన్న అఖ్తర్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు సమాన సంఖ్యలో ఉన్న నియోజకవర్గంలో ఎంఐఎం అధినేత ఒవైసీపై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.