జాతీయ వార్తలు

హిమపాతం నుంచి సైనికుడి మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీరులోని కార్గిల్‌లో హిమపాతం సంభవించడంతో గల్లంతైన కె.విజయ్ కుమార్ అనే సిపాయి ఆచూకీ కనుగొనేందుకు మూడు రోజుల నుంచి గాలింపు జరుపుతున్న సైనిక బృందాలు ఆదివారం ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మంచు కింద 12 అడుగుల లోతున కూరుకుపోయిన విజయ్ కుమార్ మృతదేహాన్ని సహాయ బృందాలు వెలికితీశాయని శ్రీనగర్‌లో రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. హిమపాతం వలన ఆ ప్రాంతంలో దాదాపు 15 అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయి తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ విజయ్ కుమార్ కోసం సహాయ బృందాలు మూడు రోజులపాటు గాలింపు చర్యలను కొనసాగించాయని, ఆయన ఆచూకీని కనుగొనేందుకు జాగిలాలతో పాటు అత్యాధునిక రాడార్లు, మెటల్ డిటెక్టర్లను కూడా ఉపయోగించడం జరిగిందని ఆయన వివరించారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వల్లరామపురం గ్రామానికి చెందిన విజయ్ కుమార్‌కు తల్లిదండ్రులతోపాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం విజయ్ కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించి పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. కాగా, విజయ్ కుమార్‌తో పాటు హిమపాతంలో చిక్కుకుని తొలి రోజే ప్రాణాలతో బయటపడిన సుజిత్ అనే మరో సిపాయి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని, ప్రస్తుతం ఆయన వేగవంతంగా కోలుకుంటున్నాడని ఆయన వివరించారు.
రానున్న 48 గంటల్లో మరో హిమపాతం: ఎస్‌ఎఎస్‌ఇ
జమ్మూ-కాశ్మీరు ఎగువ ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, బందీపూర్, కార్గిల్, గండర్బల్ జిల్లాల్లో మరోసారి హిమపాతం సంభవించే అవకాశం ఉందని, రానున్న 48 గంటల వరకు ఎవరూ ఆ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌ఎఎస్‌ఇ (స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్) ఈ హెచ్చరికలు జారీ చేసింది.