జాతీయ వార్తలు

మరి కొందరి గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏపి ల్ 5: ‘పనామా’ బాగోతం భారతీయ బడాబాబులకు గుబులు పుట్టిస్తోంది. ఒక్కో డాక్యుమెంట్ ఒక్కొక్కరి ‘నల్ల’వ్యాపార జీవితాలను బయట పెడుతుండటంతో తాము తప్పులు చేయలేదని చెప్పుకోవటానికి ఒక్కొక్కరు రకరకాల రూపాల్లో మీడియా ముందు క్యూలు కడుతున్నారు. తామేమీ తప్పు చేయలేదని.. తమంత మంచివాళ్లమని కలర్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీ అమితాబ్ కుటుంబాన్ని రచ్చకీడ్చిన పనామా పేపర్లు మంగళవారం మరికొన్ని పేర్లను బయటపెట్టాయి. ఒక్కొకరి మనీలాండరింగ్ వ్యవహారాలు, ఒకటికి మించిన విదేశీ కంపెనీలతో ముడిపడిపోయినట్లు ఈ డాక్యుమెంట్లు విస్మయకరమైన సమాచారం గుట్టురట్టు చేస్తున్నాయి. రెండో జాబితాలో నీతిమంతుల పార్టీ లోక్‌సత్తా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్, మెహ్రాసోనా జ్వెలర్స్ యజమాని అశ్వని కుమార్ మెహ్రా కుటుంబం, గౌతమ్, కరణ్ థాపర్ తదితరులకు సంబంధించిన కంపెనీలు, మనీ లాండరింగ్ వ్యవహారాల బాగోతాలు బయటపడ్డాయి. జాబితాలో బయటపడ్డ వారి వివరాలు మరికొన్ని....
అశ్వని కుమార్ మెహ్రా: మెహ్రాసన్స్ జ్వెల్లర్స్ యజమాని అయిన అశ్వని కుమార్ కుటుంబానికి బహమాస్‌తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 7 కంపెనీలు ఉన్నాయి. వీటితోపాటు పీటీసీ గ్రూప్ లిమిటెడ్‌లో వాటా కూడా ఉంది. దీనిపై మెహ్రా సోదరుడు దీపక్ స్పందించారు. ‘నాకు, మా కుటుంబానికి రెండు కంపెనీలలో వాటాలు ఉన్నమాట వాస్తవమే. 2010లో సరళీకృత చెల్లింపుల పథకం కింద ఈ కంపెనీలలో మా నిధులను తరలించాం. చట్టం అనుమతించిన సాధారణ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారానే ఇవన్నీ జరిగాయి’’ అని అన్నారు.
అనురాగ్ కేజ్రీవాల్: మూడు కంపెనీలు, రెండు ఫౌండేషన్లతో అలరారుతున్న ఈ కేజ్రీవాల్ లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో మూడు రిజిస్టర్డ్ కంపెనీలు, పనామాలో రెండు ప్రైవేట్ ఫౌండేషన్లు ఉన్నాయి. మరో కంపెనీకి పవర్ ఆఫ్ అటార్నీగా కూడా ఈయన కొనసాగుతున్నారు. ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. ‘నేను వ్యాపారిని. ఐరన్ ఓర్ వ్యాపారంలో ఉన్నాను. సరైన వ్యాపార మార్గాల్లోనే మాకు కమిషన్లు అందాయి. నేను, నా భాగస్వాములు ఎలాంటి తప్పు చేయలేదు’’ అని ఆయన అన్నారు.
గౌతమ్, కరణ్ థాపర్: పనామాలో చార్ల్‌వుడ్ ఫౌండేషన్, నికోమ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లు ఉన్నాయి. ప్రముఖ వ్యాపారి బ్రిజ్ మోహన్ థాపర్ కొడుకులైన గౌతమ్, కరణ్‌లు పనామాలో ఒక్కో ప్రైవేట్ ఫౌండేషన్‌లను ఏర్పాటు చేసుకున్నారని పనామా డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి.
అయితే గౌతమ్ థాపర్ ప్రతినిధి మాత్రం తనకు ఏ కంపెనీలోనూ వాటా లేదని, స్టిఫెన్ జాక్వెలిన్ థాపర్(యూకే పౌరురాలు)కు మాత్రం వాటా ఉందని పేర్కొన్నారు.
ప్రభాష్ శంక్లా: మధ్యప్రదేశ్ మాజీ ప్రభుత్వోద్యోగి అయిన ఈయన పనామాలోని లోటస్ హారిజన్ డైరెక్టర్‌గా ఉన్నారు.
వినోద్ రామచంద్ర జాదవ్: పూణెలోని సావా హెల్త్ కేర్ చైర్మన్ అయిన ఈయన దాదాపు 10మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కంపెనీల్లో చేస్తున్నారు.
వివేక్ జైన్: బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, హాంగ్‌కాంగ్‌లలో సాక్వినమ్ గ్లోబల్ ఎస్ ఏ, రేడియంట్ వరల్డ్ హోల్డింగ్స్ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్న ఈ వివేక్, మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ ఉపకరణాలు అమ్ముకునే ఓ వ్యాపారి. ఈ కంపెనీల్లో ఇతనికి 79వేల షేర్లు ఉన్నట్లు పనామా పత్రాలు చెప్తున్నాయి. అయితే ఈ కంపెనీల గురించి తనకేమీ తెలియదని మాత్రం వివేక్ చెప్తున్నారు.

చిత్రం... టీవీ ఇంటర్వ్యూలో పనామా వ్యవస్థాపకుల్లో ఒకరైన రామన్ ఫోనె్సకా