జాతీయ వార్తలు

సభ్యుని నియామకంపై కర్నాటక అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కృష్ణా నదీజలాల వివాదం పరిష్కరించే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించడంపై కర్నాటక అభ్యంతరం తెలిపింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కర్నాటక ప్రభుత్వం తరుఫున న్యాయవాది అనిల్ దివాన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్ సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువరించాక న్యాయమూర్తి రా మ్మోహన్‌రెడ్డిపై న్యాయస్థానాల్లో సవాల్ చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ట్రిబ్యునల్‌కు తెలిపారు. కాబట్టి ఈనియామకంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు గతంలో కర్నాటక ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖను ట్రిబ్యునల్ సమర్పించింది. అలాగే గతంలో సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు.
దీంతో ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. మొదట మహారాష్ట్ర తరఫున న్యాయవాది తన వాదనను వినిపించారు. కర్నాటక లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. గతంలో రామ్మోహన్‌రెడ్డి నియామకంపై ఏ రాష్టమ్రూ అభ్యంతరం తెలియజేయలేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు విచారణ సమయంలో కర్నాటక ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీనిపై కర్నాటక ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి నియామకంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రకటించింది. సభ్యుడి నియామకంపై కర్నాటక లేవెత్తిన అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తరఫున్యాయవాది ఎకె గంగూలీ సూచించారు. ఈ అంశంపై కర్నాటక ఇప్పుడే ప్రస్తావించింది కాబట్టి తమ వైఖరి తెలియజేయడానికి గడువుకావాలని తెలంగాణ తరఫున్యాయవాది వైద్యనాథన్ అన్నారు. కాగా రామ్మోహన్‌రెడ్డి నియామకాన్ని చర్చించేందుకు ట్రిబ్యునల్ సరైన వేదిక కాదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఖాద్రీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రామ్మోహన్‌రెడ్డి నియామకంలో కేంద్రం పాత్ర లేదని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నామినేషన్‌ను ఆమోదించడమేనని తెలిపారు. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ రాష్ట్రాలకు సూచించారు.