జాతీయ వార్తలు

ఇవి అసెంబ్లీ ఎన్నికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్బరి (అస్సాం), ఏప్రిల్ 5: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడికి దిగారు. ఇక్కడ జరిగేది లోక్‌సభ ఎన్నికలు కావనీ, అస్సాం అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చి, మోదీ ఏం చేశారో చెప్పాలనడంలో అర్థం లేదని అమిత్ షా పేర్కొన్నారు. అస్సాం అసెంబ్లీ మలిదశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ 2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో దేశాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టామో చెబుతామని, దీని గురించి సోనియా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 15 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారాన్ని ప్రజలు అప్పగించారని, అందులో 10 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ను అస్సాం ప్రజలే పంపించారని అమిత్ షా గుర్తుచేశారు. ఆ సమయంలో ఎలాంటి అభివృద్ధి సాధించారో చెప్పాలని అస్సాం ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సోమవారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో భారీ ఓటింగ్ శాతం నమోదు కావడంపై అమిత్ షా మాట్లాడుతూ, కాంగ్రెస్ ఓటమికి ఇదొక సంకేతమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం, అవినీతి రహిత పాలన కోసం బిజెపి-ఎజిపి కూటమికి ఓటువేయాలని షా పిలుపునిచ్చారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అస్సాంను బిజెపి తీర్చిదిద్దుతుందని, కాంగ్రెస్‌ను ఇంటికి పంపి బిజెపి-ఎజిపి కూటమికి పట్టం కట్టాలని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దును కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం శరణార్థులను అస్సాంలో తిష్ఠవేసేలా చేసిందని అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బంగ్లా శరణార్థులు అస్సాం యువత ఉద్యోగాలను కొల్లగొట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కానీ, కాంగ్రెస్ కాని తలుచుకుంటే బంగ్లా సరిహద్దును ఏనాడో మూసివేసేవారని, కానీ ఐదు దశాబ్దాలుగా వారు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. ‘కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది, సర్బానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రిని చేయండి. ఒక్క బంగ్లా శరణార్థి కూడా అస్సాంలో ప్రవేశించలేడు’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
అస్సాం అసెంబ్లీ మలిదశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు