జాతీయ వార్తలు

అంబేద్కర్ వారసత్వం కాంగ్రెస్‌కే సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, ఏప్రిల్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకేసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు మోదీ ప్రభుత్వం వంతపాడుతోందని, విద్యార్థుల్లో అశాంతి తీవ్రంగా పెరగడానికి ఇదే కారణమని వారు నిప్పులు చెరిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు పుట్టినిల్లు అయిన నాగ్‌పూర్‌లో వారు ఈ విమర్శలు చేయడం గమనార్హం. ఏడాదిపాటు నిర్వహించిన అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో సోనియా ప్రసంగిస్తూ, అంబేద్కర్ వారసత్వం కాంగ్రెస్ పార్టీకే సొంతమని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలకు తూట్లుపొడిచి దేశ లౌకిక స్వభావానికి విఘాతం కలిగించేందుకు, అలాగే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన కులాలు, మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్ల వ్యవస్థకు ‘పెను ముప్పు’గా పరిణమించిందని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేద్కర్‌ను చైర్మన్‌గా నియమించడం ద్వారా ఆయనకు కాంగ్రెస్ ఎనలేని గౌరవాన్ని ఇచ్చిందని సోనియా చెప్పారు.
పంచాయతీల స్థాయిలో మహిళల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, గ్రామాల్లో మహిళలు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు నిర్ధిష్టమైన విద్యార్హతలు ఉండాలన్న నిబంధనతో చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని బిజెపి పాలిత రాష్ట్రాలైన హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. దీని వలన దళితుల్లో దాదాపు 80 శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు’ అని సోనియా పేర్కొన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీతో కలసి నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి వద్ద అంబేద్కర్ స్మారకాన్ని సందర్శించారు. 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించింది ఇక్కడే.

అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం
నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో వేదికపై సోనియా, రాహుల్ గాంధీ