జాతీయ వార్తలు

కేరళలో బాణసంచాపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి/కొల్లాం, ఏప్రిల్ 12: కేరళలోని అన్ని దేవాలయాల్లో భారీ ధ్వనికారక బాణసంచా వినియోగంపై హైకోర్టు మంగళవారం నిషేధం విధించింది. కొల్లాంలోని పరువూర్ పుట్టింగల్ దేవి ఆలయంలో 110మంది ప్రాణాలను బలిగొన్న బాణసంచా పేలుడుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం, తీవ్రస్థాయిలో స్పందించింది. ఎక్కువ మందుగుండు కలిగి, భారీగా ధ్వనులను సృష్టించే బాణసంచాను సూర్యాస్తమయం తరువాత నుంచి, సూర్యోదయానికి ముందు వరకు ఏ ఆలయంలోనూ వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా అన్న దానిపై ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పుట్టింగల్ దేవి ఆలయ ఘటన కేసుకు సంబంధించి ఏడుగురు ఆలయ కమిటీ సభ్యులతోపాటు మొత్తం 13మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు కాంట్రాక్టర్లు, ఆరుగురు ఆలయ సిబ్బంది ఉన్నారు. ఏడు రోజులపాటు ఘనంగా జరిగిన ఆలయ ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం తెల్లవారుజామున బాణసంచా పేలి 110మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిని ముందుగా అదుపులోకి తీసుకున్న కేరళ క్రైం బ్రాంచి పోలీసులు రోజంతా ప్రశ్నించిన తరువాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ట్రస్టు అధ్యక్షుడు జయలాల్, కార్యదర్శి జే.కృష్ణమూర్తి, సభ్యులు శివప్రసాద్, సురేంద్రన్ పిళ్లై, రవీంద్రన్ పిళ్లైలు అరెస్టుకు ముందే నాటకీయంగా లొంగిపోతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై వీరిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని.. ఘటనకు సంబంధించి మొత్తం 20మందిపై 307 (హత్యాయత్నం), 308 (కుట్ర పూరితంగా మరణానికి ప్రేరేపించడం) పేలుడు పదార్థాల చట్టంలోని 4వ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ఎదుట లొంగిపోయన పుట్టింగల్ ఆలయ సిబ్బంది