జాతీయ వార్తలు

హామీలు గాలికొదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజాపూర్, ఏప్రిల్ 13: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వం గాలికొదిలేసిందని సోనియా ఆరోపించారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్లో ఎక్కువ పశ్చిమ బెంగాల్‌లోనే చోటుచేసుకున్నాయి’ అని విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ఐదేళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. మమత ప్రజలకు మేలు చేస్తుందని భావించగా, దానికి విరుద్ధంగా జరిగింది’ అని సోనియా విమర్శించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండాపోయిందని ఆమె అన్నారు. దేశంలోనే మహిళలపై జరుగుతున్న దాడుల్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉండడం సిగ్గుచేటని సోనియా ధ్వజమెత్తారు. తృణమూల్, బిజెపి నాణానికి అటుఇటూ అని విమర్శించారు. ‘నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ ఇద్దరూ ప్రజలను దగా చేశారు’ అని కాంగ్రెస్ అధినేత్రి విమర్శించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య రహస్య ఒప్పందం ఉందని, పార్లమెంటులో మోదీ సర్కార్ ఇబ్బందుల్లో పడితే తృణమూల్ మద్దతుగా నిలుస్తోందని సోనియా తెలిపారు.
చిట్‌ఫండ్ కంపెనీలు ప్రజలను దోచుకుంటుంటే మోదీ గానీ మమతా ప్రభుత్వం గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆమె పేర్కొన్నారు.

మాయావతికి
కొత్త చిక్కులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బిఎస్పీ అధినేత్రి మాయావతికి చిక్కులొచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తాజాగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఆమె అక్రమ ఆస్తులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదుకు సిబిఐను ఆదేశించాలంటూ కమలేశ్ వర్మ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ తాజా పరిణామం మాయావతికి ఇబ్బందికరమే. కాగా రాజకీయ కక్షసాధింపులో భాగమే పిటిషన్ అని, పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని మాయావతి తరఫు న్యాయవాది కెకె వేణుగోపాల్ అభ్యర్థించారు. కాగా మాయావతికి సంబంధించి తాజ్ కారిడార్ కేసు మాత్రం పెండింగ్‌లో ఉందని, ఆస్తుల కేసులో ఐటి శాఖ క్లీన్‌చిట్ ఇచ్చిందని సిబిఐ కోర్టుకు స్పష్టం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని, కాబట్టి మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. సిబిఐ వాదనతో అటార్నీ జనరల్ ముకుల్ రొహ్‌తగి ఏకీభవించారు. మాయావతికి గతంలోనే ఐటి శాఖ క్లీన్‌చిట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.