జాతీయ వార్తలు

మత రాజకీయాలు ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందన్‌ఘాట్, ఏప్రిల్ 13: బిజెపి హిందుత్వాన్ని రెచ్చగొడుతూ శాంతియుత వాతావరణాన్ని పాడుచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మతతత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పోకడలను ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. ‘సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్డడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. మత రాజకీయాలు చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతోంది’ అని ఆమె ఆరోపించారు. బర్‌ద్వాన్ జిల్లా పుర్‌బస్థలీలో బుధవారం ఎన్నికల సభలో మాట్లాడిన సిఎం బెంగాల్ ప్రజల్లో చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని అన్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా విద్వేషాలు సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను తాము అడ్డుకుంటామని మమత ప్రకటించారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు చూసి ఢిల్లీ పాలకులు అసూయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, సిపిఎం, బిజెపిలపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. బెంగాల్ ప్రజల బాగోగులు ఆ పార్టీలకు పట్టడం లేదని, కులం, మతం పేరుతో ఓటర్లలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, సిపిఎంలు అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నాయని, ఉనికి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సిపిఎం తోకపట్టుకుని పాకులాడుతోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు తెరమరుగైపోయిన సిపిఎం ఆశలు నెరవేరవని ఆయన చెప్పారు. 34ఏళ్ల వామపక్షాల పాలనలో రాష్ట్రం అథోగతిపాలైందని ఆమె విరుచుకుపడ్డారు.

‘కాజిరంగ’లో విలియమ్ దంపతులు
కాజిరంగ, ఏప్రిల్ 13: అసోంలోని ప్రపంచ ప్రఖ్యాత కాజిరంగ నేషనల్ పార్కును బుధవారం బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ సందర్శించారు. అనంతరం పార్కు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, కాజిరంగ డిస్కవరీ సెంటర్‌ను, వన్యప్రాణి పునరావాస, సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. పార్కులోని బాగోరి రేంజి ప్రాంతంలో పాక్ అధికారులతో కలిసి జీపులో విహరించిన తర్వాత విలియమ్ దంపతులు ఏనుగుల రాకపోకలకు ఒక కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు తమ నివాస గృహాలను వేరేచోటికి తరలించిన రోంగ్ తరంగ్ గావ్‌ను సందర్శించారు. మనుషులకు, ఏనుగులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి గ్రామస్థులు తీసుకున్న చర్యలను విలియమ్ దంపతులు ఆసక్తిగా విన్నారు.
గిరిజన సంప్రదాయ ప్రార్థనా మందిరమైన ‘నామ్‌ఘర్’ను సందర్శించారు. తమ పాదరక్షలను బయటే విప్పి లోపలికి ప్రవేశించిన వారు మందిరంలో ‘నామ్-ఘోష’ (పవిత్ర గ్రంథం) ఉంచిన వేదిక వద్ద తలవంచి నమస్కరించారు. అనంతరం వారు గ్రామస్థులు, అధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు. రాజ దంపతులు పన్‌బారి ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పునరావాస కేంద్రాన్ని కూడా సందర్శించారు. అక్కడ వారికి రాష్టవ్య్రాప్తంగా మనిషికి, ఏనుగులకు మధ్య ఎదురవుతున్న ఘర్షణపై ఒక డాక్యుమెంటరీని చూపించారు. అనంతరం వారు కాజిరంగ డిస్కవరీ సెంటర్‌ను సందర్శించారు. ఇక్కడే మార్క్‌షాండ్ ఆసియన్ ఎలిఫెంట్ లెర్నింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఉన్న క్యాప్టివ్ ఎలిఫెంట్ క్లినిక్ కార్యకలాపాల గురించి అధికారులు వారికి వివరించారు. ఇప్పటివరకు ఈ క్లినిక్ 4,883 కేసులను పూర్తి చేసింది. ప్రముఖ పర్యాటక రచయిత, వన్యప్రాణి సంరక్షకుడు అయిన షాండ్ 2002లో ఈ ఏనుగుల ఫౌండేషన్ సహవ్యవస్థాపకుడు. ఆయన బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన కార్న్‌వాల్ యువరాణి కామిల్లా సోదరుడు కూడా.