జాతీయ వార్తలు

మహావీరుని బోధనలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఉగ్రవాదం, వాతావరణ మార్పు, అసమానతలు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లని పేర్కొంటూ, మహావీర్ జైన్ ప్రవచించిన మూడు సూత్రాలు అహింస, అనేకాంత్ (్భన్నత్వంలో ఏకత్వం), అపరిగృహ (పరిత్యాగం)లు ఈ మూడు సవాళ్లకు పరిష్కారాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. జైనమత ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేశ్ ముని స్థాపించిన అహింస విశ్వ భారతి సంస్థ మహావీర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ‘ప్రపంచ శాంతి సామరస్య దినోత్సవం’లో సుష్మ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు నజ్మా హెప్తుల్లా, రవిశంకర్ ప్రసాద్, నటుడు వివేక్ ఒబెరాయ్, పలువురు మత, ఆధ్యాత్మిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న వారు తమ భావజాలమే అత్యున్నతమైనదని భావిస్తున్నారని, వారి భావజాలాన్ని విశ్వసించని వారిని హతమారుస్తున్నారని సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన విలువలను ఎంపిక చేసుకొని, ఆచరించడానికి ఉన్న హక్కు గురించి మహావీర్ జైన్ ప్రవచించిన ‘అనేకాంత్’ (్భన్నత్వంలో ఏకత్వం) సూత్రం చర్చిస్తుందని, అందువల్ల ఈ సూత్రం ఉగ్రవాద జాడ్యాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహిస్తుందని ఆమె వివరించారు. ఒక వ్యక్తి మంచి హిందువు, ముస్లిం, సిక్కు, క్రైస్తవుడు, జైన్ లేదా మరో మతాన్ని ఆచరించే వ్యక్తి అయి ఉండవచ్చని, అయితే అతను తన భావజాలాన్ని ఇతరులపై రుద్దకూడదని, ఇదే లౌకికవాదం భావన అని సుష్మ పేర్కొన్నారు. ‘ప్రకృతి మానవుని అవసరాలను తీరుస్తుంది. కాని, అత్యాశను తీర్చలేదు’ అన్న మహాత్మా గాంధీ బోధనలను మంత్రి ప్రస్తావిస్తూ, మానవుడు అత్యాశకు పోయి ప్రకృతి నుంచి ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నందు వల్లనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. మానవుడు అత్యాశకు పోయినప్పటి నుంచే వాతావరణ మార్పు సమస్య తలెత్తిందని అన్నారు. మనకు ఏం కావాలో ఇవ్వడానికి ప్రకృతి సిద్ధంగా ఉందని, అయితే మనం మాత్రం చెట్లు నరుకుతున్నామని, సముద్రాలను, నదులను కాలుష్యమయం చేస్తున్నామని పేర్కొంటూ, ఈ చర్యలు సునామీ, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు దారి తీస్తాయనేది మనం మరచిపోతున్నామని సుష్మ అన్నారు. ఈ విషయంలో ‘ఏది ఎంత అవసరమో అంతవరకే అడుగు’ అనే మహావీరుని సందేశం ఎంతో ముఖ్యమైనదని ఆమె వివరించారు. కొంత మంది అవసరం ఉన్నదానికన్నా ఎంతో ఎక్కువ సంపాదించడంపై దృష్టి పెడుతున్నందు వల్లనే అసమానత్వం ఏర్పడుతోందని ఆమె అన్నారు. ఈ విషయంలో మహావీరుడు బోధించిన ‘మనుగడకు ఎంత అవసరమో అంత మాత్రమే సేకరించుకో’ అనే సూత్రం అనుసరణీయమని ఆమె అన్నారు.