జాతీయ వార్తలు

కేంద్ర పథకాలన్నింటికీ ‘ప్రధాని’ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇకపై ‘ప్రధాని’ పేరు లేదా జాతీయ నాయకుల పేర్లను పెట్టాలని కేంద్ర మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రాల్లో, జిల్లాల్లో కేంద్ర పథకాల అమలు, అవి విజయవంతమవుతున్న తీరు ప్రజలకు మరింత చేరువ కావటానికి తీసుకోవలసిన చర్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఒక మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం సమావేశమై వివిధ అవకాశాలపై చర్చలు జరిపింది. అన్ని పథకాలకు ‘ప్రధాని’ పేరును, లేదా జాతీయ నాయకుల పేర్లను పెట్టడమే కాకుండా.. ప్రతి సినిమా హాలులో సినిమా ప్రారంభానికి ముందు ఈ పథకాలకు సంబంధించిన లఘు చిత్రాలను ప్రసారం చేయటం తప్పనిసరి చేయాలని కూడా మంత్రుల బృందం సూచించింది. ప్రభుత్వ విజయాలకు సంబంధించి హాస్యస్ఫోరకంగా ఉండే విధంగా ప్రతి రెండు వారాలకు ఒక లఘు చిత్రాన్ని రూపొందించి ప్రసారానికి పంపించాలని పేర్కొంది. ఈ చిత్రాలు పాత్రలతో కానీ, యానిమేషన్ చిత్రాలతో కానీ రూపొందించవచ్చని సలహా ఇచ్చింది.

కశ్మీర్ యువతకు గల్ఫ్ నిధులు
ఉగ్రవాదం వైపు మళ్లించే కుట్ర
శ్రీనగర్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కశ్మీర్ లోయలో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ నిధులు హవాలా మార్గంలో తరలి వస్తున్నాయని నిఘావర్గాలు తెలిపాయి. ఐసిస్, అల్‌ఖాయిదా ఉగ్ర సంస్థల నుంచి మతం పేరుతో యువతను ఆకర్షించి, అవసరమైన డబ్బు ఎరవేసి తమ వైపు లాక్కుంటున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ లోయలో శతాబ్దాలుగా పాటిస్తున్న సూఫీ సంప్రదాయం నుంచి ఈ తరం ముస్లిం యువత క్రమంగా దూరమవుతోందని పేరు చెప్పటానికి ఇష్టపడని చాలామంది మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. పాత తరం కుటుంబాలు సంప్రదాయ మసీదుల్లో నమాజు చేస్తుంటే, ఈ తరం యువత కొత్త ప్రార్థనామందిరాల్లో ప్రార్థనలు చేస్తున్నారన్నారు.

రాందేవ్ ఫుడ్ పార్క్ వద్ద
24గంటల సిఐఎస్‌ఎఫ్ భద్రత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: హరిద్వార్‌లోని యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ఫుడ్ పార్క్ వద్ద 24 గంటల పాటు సిఐఎస్‌ఎఫ్ బలగాల భద్రత ప్రారంభమయింది. అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 34 మంది సాయుధ కమాండోలు మార్చి 22వ తేదీ నుంచి ఈ ఫుడ్ పార్క్ వద్ద నిరంతరం భద్రతా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఫుడ్ పార్క్‌కు 24 గంటల పాటు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మొదట్లో ఆదేశించిందని, దాంతో తాము మార్చి నుంచి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నామని వారు వివరించారు. ఇలాంటి భద్రతను కేంద్రం ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ వంటి కేవలం ఏడు ప్రైవేటు సంస్థలకే కల్పిస్తోంది. పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిఐఎస్‌ఎఫ్ భద్రతను ఉపయోగించుకున్నందుకు పూర్తి స్థాయిలో రుసుము చెల్లించడంతో పాటు తమ సిబ్బందికి అవసరమైన బారక్‌లు, వాహనాలు వంటి సౌకర్యాలను సమకూరుస్తోందని సీనియర్ అధికారులు తెలిపారు.

కన్హయ్యపై మళ్లీ దాడి
ముంబయి, ఏప్రిల్ 24: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై మరోసారి దాడి జరిగింది. ఆదివారం పుణె వెళ్లడానికి ముంబయిలో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎక్కిన కన్హయ్యపై సహ ప్రయాణికుడు ఒకరు దాడికి దిగాడు. ఈ దాడికి సంబంధించి మానస్ జ్యోతి దేకా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.