జాతీయ వార్తలు

ఉద్యమంగా నీటి ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులను అధిగమించేందుకు నీటిని ఆదా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టటాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోదీ ఆదివారం ఆకాశవాణిలో తన 19వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నీటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం తాను చేయగలిగినంత చేస్తోంది, అయితే ప్రజల కూడా తమ పాత్రను నిర్వహించాలి, ప్రజలు తలచుకుంటే పెద్ద ఎత్తున నీరు ఆదా అవుతుందని సూచించారు. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేయవలసి ఉన్నద’ని మోదీ పిలుపు ఇచ్చారు. మహారాష్టల్రోని అహమద్‌నగర్ జిల్లాకు చెందిన హివారే బజార్ గ్రామ ప్రజలు బిందు సేద్యం, వర్షపు నీటిని భద్రపరచుకోవటం, రీచార్జింగ్ పద్దతుల ద్వారా నీటిని అత్యంత పొదుపుగా వాడుకుంటూ అధిక పంటను సాధిస్తున్నారని మోదీ ప్రశంసించారు. వర్షపు నీటిని భద్ర పరచుకునేందుకు ఉద్యమం ప్రారంభించాలంటూ అందరు కలిసి పని చేస్తే తప్ప ఈ లక్ష్యాన్ని సాధించలేమని ప్రధాని సూచించారు. మధ్యప్రదేశ్‌లోని దెవాస్ జిల్లాకు చెందిన గోర్వా గ్రామ పంచాయితీ ప్రజలు 27 వ్యవసాయ కుంటలను నిర్మించుకోవటం ద్వారా భూగర్భ జలాలను గణనీయంగా పెంచుకోగలిగారన్నారు. భూగర్భ జలాలు పెరిగితే నీటి నాణ్యత కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. కరువునెలకొన్న లాతూర్ ప్రజలను ఆదుకునేందుకు నీటి రైలును పంపించినందుకు ఆయన రైల్వే శాఖను అభినందించారు. ఈ వర్షాకాలం మంచి వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చేసిన అంచనా గురించి ప్రస్తావిస్తూ దేశంలో ఈసారి మంచి పంటలు పండుతాయనే ఆశను ఈ వార్తలు చిగురింపజేశాయని మోదీ అన్నారు. దేశానికి తలమానికమైన గంగానదిని పరిశుభ్రపరిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. విద్యా రంగం గురించి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల గురించి తమ పిల్లలను అడిగి తెలుసుకోవాలని మోదీ తల్లిదండ్రులుకు హితవు చెప్పారు. పిల్లలు విద్యను ఎలా అభ్యసిస్తున్నారనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తమ సబ్సిడీ ఎల్.పి.జి కనెక్షన్లను స్వచ్చందంగా వదులుకున్న ఒక కోటి మంది వినియోగదారులకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వార్తాపత్రికలు, టెలివిజన్ చానళ్లు మంచి వార్తలను ముద్రించటం, ప్రసారం చేయటం ద్వారా సానుకూలత వాతావరణాన్ని సృష్టించాలన్నారు. వార్తా పత్రికలు తమ మొదటి పేజీల్లో కేవలం మంచి వార్తలను మాత్రమే ముద్రించాలన్న మాజీ రాష్టప్రతి డాక్టర్ అబ్దుల్ కలాం సూచనను నరేంద్ర మోదీ గుర్తు చేశారు.