జాతీయ వార్తలు

అలీగఢ్ ముస్లిం వర్శిటీలో హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్, ఏప్రిల్ 24: అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ప్రత్యర్థి వర్గాల మధ్య కాల్పుల్లో యూనివర్శిటీనుంచి బహిష్కరణకు గురయిన ఓ విద్యార్థి సహా ఇద్దరు మృతి చెందాడు. దీంతో అధికారులు క్యాంపస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(రాఫ్)బలగాలను మోహరించడంతో పాటుగా ఎఎంయు హాస్టళ్లలో అసాంఘిక శక్తులను బయటికి పంపించి వేయడానికి పెద్ద ఎత్తున ప్రక్షాళన ఆపరేషన్‌కు ఆదేశించింది. రెండు విద్యార్థి వర్గాల మధ్య గొడవ కారణంగా శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో హింస చెలరేగినట్లు పోలీసు ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అలీగఢ్ రేంజ్ డిఏజి గోవింద్ అగర్వాల్ ఆదివారం చెప్పారు. ముంతాజ్ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిపై దాడి చేసి కొట్టడంతో పాటుగా అతని గదికి నిప్పు పెట్టడంతో గొడవ మొదలైంది, దాడికి గురయిన విద్యార్థి పిర్యాదు చేయడం కోసం ప్రోక్టర్ ఆఫీసుకు పరుగుపెట్టాడు. ఈ సంఘటన వార్త తెలియగానే ప్రత్యర్థి వర్గాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో గొడవ పెద్దదయింది. రెండు వర్గాలు తుపాకులతో కాల్పులకు దిగడంతో ప్రోక్టర్ ఆఫీసుకు సమీపంలో మహ్తాబ్ అనే విద్యార్థి హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి ఆస్పఅతిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడని వారు చెప్పారు. రెచ్చిపోయిన విద్యార్థులు ఒక జీపు, మరో అరడజను బైక్‌లకు నిప్పు పెట్టారు. అంతేకాదు దహనకాండకు సైతం దిగిన గుంపుప్రోక్టర్ కార్యాలయం భవనాన్ని సైతం తగులబెట్టారు. క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో గొడవ పడుతున్న వారిని చెదరగొట్టడానికి పోలీసులు 2 గంటలకు పైగా సమయం పట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్, సంభాల్ ప్రాంతానికి చెందిన ప్రత్యర్థి వర్గాల మధ్య గత కొంతకాలంగా విద్వేషాలు నివురుగప్పిన నిప్పులా రగులుతూ ఉన్నాయని ఎఎంయు అధికారి ఒకరు చెప్పారు. మహ్తాబ్ హత్యకు సంబంధించి ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థి మొహిసిన్ ఇక్బాల్‌తో పాటుగా మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని, వీరిలో చాలామంది బైటివారు, మాజీ విద్యార్థులని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ వకీఫ్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స కోసం అతడ్ని ఢిల్లీకి తరలించారు. అక్కడ అతను చనిపోయాడు. వకీఫ్ ఎఎంయు విద్యార్థి కాదని, అయితే యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నాస్తున్నాడని, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ కావడం కోసం క్యాంపస్‌కు దగ్గర్లోనే ఉంటున్నాడని యూనివర్శిటీ అధికారులు చెప్పారు. కాగా, ఆదివారం ఇంజనీరింగ్ కాలేజిల్లో చేరడం కోసం ఎంట్రన్స్ పరీక్ష జరగనున్న దృష్ట్యా సున్నితమైన ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. ఒక్క ఎఎంయు క్యాంపస్ సెంటర్‌లోనే 13 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. అయితే పరీక్ష ప్రశాంతంగాముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, తాజా హింసాకాండ దృష్ట్యా రాబోయే రెండు వారాలు వివిధ హాస్టళ్లలో పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ రిటైర్డ్ లెఫ్టెనెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చెప్పారు. జూన్ 6న వేసవి సెలవులకోసం యూనివరిర్శిటీ మూతపడ్డాక అన్ని హాస్టల్ రూమ్‌లను ఖాళీ చేయిస్తామని, తిరిగి కొత్తగా కేటాయింపులు జరిపాకే విద్యార్థులను అనుమతించడం జరుగుతుందని విసి చెప్పారు.