జాతీయ వార్తలు

విభజన హామీలను ప్రస్తావిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం , రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, కరువుపై పార్లమెంట్ సమావేశాలలో చర్చిస్తామని టీడీపి ఏంపీ తోట నర్సింహం అన్నారు. సోమవారం నుండి పార్లమెంటు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఆదివారం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షాతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి తోట నర్సింహం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో అందరికి మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని పార్టీలకు హామీ ఇచ్చారని తోట చెప్పారు.
పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీల నేతలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరినట్లు తెరాస లోక్‌సభ ఫ్లొర్ లీడర్ జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు అయినా విభజన చట్టంలోని అంశాలను కేంద్ర సీరియస్ గా తీసుకోవడం లేదని స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అఖిలపక్షంలో తెలియజేసామన్నారు. కరువు కారణంగా తెలంగాణలో తాగు నీటి ఇబ్బందులను అఖిలపక్షం దృష్టి తీసుకొచ్చామన్నారు.
మరోవైపు దేశంలో కరుపు పరిస్థతులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరాయని వైకాపా పార్లమెంటరీ పార్టీనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ , అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభ అంశాలను లెవనెత్తిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరధ పథకం పై అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించానని, ఈ పథకం దేశంలో అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని కోరానని తెలిపారు. విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై ఈ పార్లమెంటు సమావేశాలలో చర్చించడానికి సమయం ఇవ్వాలని కోరినట్లు మేకపాటి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.