జాతీయ వార్తలు

రియల్ ఎస్టేట్ రంగం ఇక ఉరకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఫ్లాట్ కొనుగోలుదారులు ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తోంది. కార్యాచరణ నియమాలు, నియంత్రణ అధికార వ్యవస్థ (రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటు, పునర్వివిచారణ న్యాయ స్థానాలు (అప్పెల్లెట్ ట్రిబ్యునల్స్) పని మే 1నుంచి ప్రారంభం అవుతాయని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ శనివారం ప్రకటించింది. రియల్ ఎస్టేట్ చట్టానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోలుదారులతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడటం, వాటిని అదుపు చేసేందుకు ఉద్దేశించిన ఈ చట్టంలోని అవసరమైన 69 విభాగాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చట్టం అమలులోకి రావటం వలన రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేందుకు వీలుకలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయ లావాదేవీల నిర్వహణ, ఫ్లాట్ల నిర్మాణం గడువు మేరకు పూర్తిచేసేందుకు సంబంధించిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టానికి సంబంధించిన నియమ, నిబంధనలను ఆరు నెలల్లోగా నోటిఫై చేయవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ నియంత్రణ అధికార వ్యవస్థ (రెగ్యులేటరీ అథారిటీ)ని ఏర్పాటు చేసిన వెంటనే రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ తమ ప్రాజెక్టులను దీనివద్ద రిజష్టరు చేయవలసి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అథారిటీకి ఇవ్వలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు అథారిటీకి ఇచ్చిన వివరాల మేరకు నిర్మాణం పనులు పూర్తి చేయవలసి ఉంటుంది, ముందు ప్రకటించిన ప్రకారం పనులు పూర్తిచేయని సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం రెగ్యులేటరీ అథారిటీకి ఉంటుంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆదేశం మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ రియల్ ఎస్టేట్ చట్టం మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తోంది.

వేసవి సెలవుల్లోనూ
విధుల నిర్వహణ

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల చరిత్రాత్మక నిర్ణయం

అలహాబాద్, ఏప్రిల్ 30: అలహాబాద్ హైకోర్టులోని అధిక శాతం మంది న్యాయమూర్తులు తమ వేసవి సెలవులను కుదించుకొని పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి విధులకు హాజరయ్యేందుకు అంగీకరించారు. న్యాయమూర్తులు ఇలా వేసవి సెలవులను కుదించుకొని విధులకు హాజరు కావడం దేశంలో ఇదే తొలిసారి. లక్నోలో ఉన్న ధర్మాసనంలో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులతో కలుపుకొని అలహాబాద్ హైకోర్టులో మొత్తం 79 మంది న్యాయమూర్తులు ఉండగా, అందులో 68 మంది తమ వేసవి సెలవులను కుదించుకోవడానికి అంగీకరించారని కోర్టు వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను ముఖ్యంగా నిందితులు దశాబ్దాల తరబడి జైళ్లలో మగ్గుతున్న క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి జూన్ ఒకటి నుంచి 30వ తేది వరకు ఉన్న వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చేసిన ప్రతిపాదనను వీరు అంగీకరించారని ఆ వర్గాలు వివరించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పెండింగ్ కేసులు పెరిగిపోతుండటంపై కంటితడి పెట్టుకున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. నెల రోజుల వేసవి సెలవుల్లో 15 రోజులను మాత్రమే వినియోగించుకొని, మిగతా 15 రోజులు విధులకు హాజరు కావాలని చంద్రచూడ్ చేసిన ప్రతిపాదనకు 68 మంది న్యాయమూర్తులు అంగీకరించారని కోర్టు వర్గాలు తెలిపాయి.