జాతీయ వార్తలు

మావి మాటలు కాదు... చేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలియా, మే 1: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఢంకాను ప్రధాని నరేంద్ర మోదీ మోగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదుకోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజి కనెక్షన్లను అందించే ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ పథకాన్ని ఆదివారం నాడిక్కడ ప్రారంభించారు. అభివృద్ధి, పేదరిక నిర్మూలనే తన ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించిన మోదీ, రాష్ట్రాన్ని పాలించిన అనేక ప్రభుత్వాలు అధ్వాన్నంగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో పేదరికం ఇంకా తొలగిపోలేదన్నారు. యుపినుంచి అత్యధిక స్థాయిలో ప్రధానమంత్రులు ఎంపికయ్యారని గుర్తుచేసిన మోదీ, ‘ఇంత ఘనత సాధించినప్పటికీ యుపిలో పేదల సంఖ్య తగ్గలేదు. నిరుద్యోగం కూడా తీవ్రంగానే ఉంది’ అని పేర్కొన్నారు. పేదరికాన్ని అధిగమించే విధంగా పేదలకు ఆర్థిక సాధికారికతను, స్వావలంబనను ప్రభుత్వాలు అందించకపోవడం వల్లే రాష్ట్రంలో పేదల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చినా, ఎన్నో పథకాలను అమలుచేసినా అవేవీ కూడా పేదలకు ప్రయోజనం కలిగించలేదని వెల్లడించారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పథకాల రచన జరిగినప్పుడే అవి సార్థకమవుతాయని వెల్లడించిన ప్రధానమంత్రి ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎన్నికల దృష్టితోనే ఈ ప్రయత్నాలు చేశాయే తప్ప పేదలను ఉద్ధరించాలన్న ఉద్దేశం వారికి ఏ కోశాన లేదని ధ్వజమెత్తారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో పేదరికం తీవ్ర స్థాయిలోనే వెల్లడించిన ఆయన, ‘1955లో అప్పటి ప్రధాని నెహ్రూ సమక్షంలోనే ఘాజీపూర్ ఎంపి ఒకరు పేదరికం గురించి ప్రస్తావించారు. ఆ తర్వాతే ఏర్పాటైన పటేల్ కమిషన్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సిఫార్సులు చేసింది. యాభై ఏళ్లు గడిచినా ఇంతవరకు ఆ సిఫార్సుల అమలు జరగనే లేదు’ అని గుర్తుచేశారు. పేదలకు సాధికారికత సాధించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పిన మోదీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించాలని, ఆవాసాలను కల్పించాలని, రక్షిత నీటిని అందుబాటులోకి తేవడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా వంటివాటివల్లే పేదల జీవితాల్లో నమ్మకం, ధీమా పెరుగుతాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీటన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రంలో పేదరికం తీవ్రమైందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైనే దృష్టిపెట్టి అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నామని తెలిపారు. పేదరిక రేఖ దిగువన వున్న కుటుంబాల్లో మహిళల పేరిటే ఎల్‌పిజి కనెక్షన్లు ఇస్తామని వెల్లడించిన మోదీ, మొదటి ఏడాదిలో కోటిన్నర కనెక్షన్లను అందిస్తామన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో ఐదుకోట్ల కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజిని అందించే లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతామని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 60 సంవత్సరాల కాలంలో కేవలం పదమూడు కోట్ల మేర మాత్రమే ఎల్‌పిజి కనెక్షన్లు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నానన్న ఆరోపణలను మోదీ తిరస్కరించారు. ఈ పథకాన్ని బలియాలోనే ప్రారంభించాలని తాను నిర్ణయించుకోవడానికి కారణం ఇక్కడ వందమందిలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉందని తెలిపిన మోదీ, దేశంలోనే ఇది అత్యంత కనిష్ఠ స్థాయి అని చెప్పారు.

చిత్రం... ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు ఎల్‌పిజి కనెక్షన్‌ను అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా