జాతీయ వార్తలు

పెళ్లికి నగదు మార్చుకోలేక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలియా, నవంబర్ 16: కూతురు పెళ్లికి ముందు జరిగే ‘‘తిలక్’’ కార్యక్రమానికి తగిన నగదు లేక.. పాత నోట్లను మార్చుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో మరణించాడు. సహత్‌వార్ నగర్ పంచాయత్‌కు చెందిన సురేశ్ సోనర్ కూతురు సుమన్ తిలక్ కార్యక్రమం బుధవారం జరగాల్సి ఉంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దుతో కూతురు తిలక్ కార్యక్రమానికి అవసరమైన నగదు తక్కువ పడింది. దీంతో రెండు రోజుల నుంచి నగదు మార్పిడి కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాసి వచ్చాడు. మంగళవారం సాయంత్రం కూడా గంటల తరబడి స్థానిక స్టేట్‌బ్యాంక్ ముందు నిలుచున్నా నగదు మార్చుకోలేకపోయాడు. మనస్తాపంతో ఇంటికి వచ్చిన సురేశ్ మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో గుండెపోటుకు వచ్చి మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.