నిజామాబాద్

స్పెషల్ బ్రాంచ్‌లో మొదలైన కదలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూన్ 7:పోలీసు శాఖలో నిఘా నేత్రాలుగా విధులు నిర్వహించే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కదలిక మొదలయ్యింది. ఇన్నాళ్లు స్తబ్దంగా ఉన్నటువంటి ఎస్‌బి అధికారులు తమ ప్రత్యేకతను చాటుకోవడంలో నిమగ్నమయ్యారు. పాసుపోర్టు దరఖాస్తుల ఎంక్వయిరీలకే పరిమితమైన సర్కిల్ స్థాయి అధికారులు నేడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పోలీసు శాఖలో ఠాణాల వారీగా నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి సారిగా ఇద్దరు ఎస్సైల వ్యవహారాలపై ఎస్‌బి వర్గాలు ఎంక్వయిరీలు చేసి వాస్తవాలతో నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందచేసినట్లు తెలిసింది. ఈ ఇద్దరు అధికారుల వ్యవహారం పై ఎస్‌బి ఇచ్చిన నివేదికలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఆ రెండు ఠాణాలలో ఉత్కంఠత నెలకొన్నది. గత నాలుగు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారి స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్కిళ్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అన్ని సర్కిళ్ల అధికారులు స్తబ్దతను వీడి విధి నిర్వహణలో ప్రత్యేకతను చాటుకోవాలని సూచించారని తెలిసింది. ఇక నుండీ అన్ని విషయాలలో ఎస్‌బి ముందస్తు సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని స్పష్టం చేయడంతో అధికారులు అప్రమత్తమయినట్లు స్పష్టమవుతోంది. తమకు కేటాయించిన మండలాల వారీగా నెలకొన్న పరిస్థితులను జిల్లా ఉన్నతాధికారికి వివరించిన అధికారులు సమాచార సేకరణ విషయంలో మరో అడుగు ముందుకేసారు. బోధన్ డివిజన్‌లో గత కొంతకాలం నుండి ఇసుక వ్యవహారం కొంతమంది పోలీసు అధికారులను విమర్శల పాలు చేసిన సంగతి విధితమే.
అంతేకాకుండా ఓ పై స్థాయి అధికారి ఈ విమర్శలతోనే బదిలీ బాటలో పయనించారు. దీనికి తోడు ఈ డివిజన్ మహారాష్టక్రు సరిహద్దులో ఉండటం, పేకాట, క్లబ్‌లు, మట్కా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఈ డివిజన్‌లో ఎక్కువగా ఉంటాయన్న పక్కా సమాచారంతో జిల్లా ఉన్నతాధికారి ఈ ప్రాంత ఎస్‌బి వర్గాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. గత నెల రోజులుగా ఈ డివిజన్‌లో పేకాట కేంద్రాలపై విస్త్రుతంగా దాడులు జరుగుతున్నాయి. దాంతో హైటెక్ స్థాయిలో జరిగిన పేకాటకు పూర్తిగా కళ్లెం పడింది. ఈ పేకాట కేంద్రాలన్ని ఇటీవలనే మూతపడటంతో గతంలో నడిచాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఉన్నతాధికారి ఈ సబ్‌డివిజన్‌లోని ఎస్‌బి వర్గాలకు కొన్ని విషయాలలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచ్ వర్గాలు అప్రమత్తం కావడం వలన ఠాణాలలో విధులు నిర్వహించే అధికారులు సైతం అలర్ట్‌గా ఉంటూ రాజీకి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. పేకాట సమాచారం రాగానే మఫ్టీలో వెళ్లి దాడులు నిర్వహిస్తున్నారు. ఎస్‌బి వర్గాలు సమాచారాన్ని చేరవేస్తున్నాయని తెలియడంతో ఠాణాల అధికారులు సైతం విధి నిర్వహణలో నిర్లక్ష్యం జరుగకుండా ఉండేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు అధికారులు ఒత్తిళ్లను అధిగమిస్తూ విధి నిర్వహణలో ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.