నిజామాబాద్

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూన్ 7: సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవడం కోసం ఎవరికి కూడా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన సాదాబైనామాలపై పేరు మార్పిడి కోసం ఈ నెల 15వ తేది వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని యాల్ల రాములు మెమోరియల్ హాలులో మంగళవారం రెవిన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, విఆర్‌ఓలతో సాదాబైనామాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ 2014 జూన్ 2 కంటే ముందు సాదాబైనామాలు ఉన్న రైతులు మీ సేవా కేంద్రాల్లో 35 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 35 రూపాయలు కంటే అధికంగా ఇవ్వొద్దని సూచించారు. పట్టణ ప్రాంతాల వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదన్నారు. సాదాబైనానాలతో దరఖాస్తు చేసుకున్న రైతులు తహశీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లోని దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఐదు ఎకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని అన్నారు. సోమవారం నాటికి జిల్లాలో 2089 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇందులో ఆర్మూర్ ప్రాంతం నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయన్నారు. సాదాబైనామాలపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పోతు నర్సయ్య, జడ్పీటిసి సాందన్న, ఆర్‌డిఓ యాదిరెడ్డి, తహశీల్దార్లు శ్రీ్ధర్, బావయ్య, వినోద్‌కుమార్, అర్చన, వెంకట్‌రావు, శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్ నాగరాజుగౌడ్, ఆర్‌ఐలు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.